Advertisement
Advertisement
Abn logo
Advertisement

వడివడిగా ‘దళితబంధు’

 పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికైన తిరుమలగిరి మండలం

 తొలి విడతగా రూ.50కోట్లు మంజూరు

 కలెక్టర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఖాతాలో నిధులు జమ

 హర్షం వ్యక్తం చేస్తున్న దళిత కుటుంబాలు 8 500 కుటుంబాలకు లబ్ధి

తిరుమలగిరి, నవంబరు 14: ‘దళితబంధు’కు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన తిరుమలగిరి మండలంలో పథకం అమలుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ పథకానికి తొలి విడతగా రూ.50కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని కలెక్టర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ జాయింట్‌ ఖాతాలో జమచేసింది. మండలంలో ఇప్పటికే గ్రామకమిటీలను ఏర్పాటు చేసి, ప్రతీ వార్డుకు ప్రత్యేక అధికారులను నియమించింది. వీరు సర్వే నిర్వహించి దళిత బందు పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. తొలి విడత లబ్ధిదారులను ఎంపికచేసి వారికి ఏ రంగాల్లో ఆసక్తి ఉందో తెలుసుకుని లాభదాయక యూనిట్లను సూచించారు. మండలంలో మొత్తం 2412 దళిత కుటుంబాలు ఉండ గా,ఒక్క తిరుమలగిరి మునిసిపాలిటీలో 1226 కుటుంబాలు ఉన్నాయి. మండల వ్యాప్తంగా 16 గ్రామాల్లో 1186 దళిత కుటుంబాలు ఉన్నాయి. కాగా, తొలి విడతలో 500 కుటుంబాలకు లబ్ధిచేకూరనుంది.

హర్షం వ్యక్తం చేస్తున్న దళితులు

దళిత కుటుంబాలో చాలా వరకు నిరుపేదలే ఉన్నారు. కూలినాలి చేసి బతుకీడుస్తున్నారు. కాగా, ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకంతో తమ తలరాతలు మా రుతాయని, గౌరవంగా బతికే అవకాశం కలుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

పోతరాజు రజని

దళితబంధు ఓ వరం:  పోతరాజు రజని, తిరుమలగిరి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌

మునిసిపాలిటీతోపాటు మండల పరిధిలోని దళిత కాలనీలన్నీ వెనుకబడే ఉన్నాయి. చాలా మందికి సొంత ఇళ్లు లేవు. కొన్ని కాలనీల్లో సరైన మౌలిక వసతులు లేవు. 90శాతం మంది నిరుపేదలే.అంతారోజూ కూలీలు, చిరువ్యాపారులుగా జీవనం సాగిస్తున్నా రు. మా కాలనీలను బాగుచేయాలని చాలా కాలంగా వారు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దళితబంధు పైలట్‌ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. ఇంతకాలం దళితుల గురించి ఆలోచించిన నాయకుడే లేడు. ఆర్థికంగా వెనుకబడిన దళితులకు ఈ పథకం ఓ వరం. ప్రతీ దళితుడి ఇంట్లో సీఎం కేసీఆర్‌ ఫొటో పెట్టి పూజించాలి.


Advertisement
Advertisement