Abn logo
Sep 19 2021 @ 22:55PM

దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న రఘునందన్‌రావు

  ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌


దుబ్బాక, సెప్టెంబరు 19: సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం దుబ్బాకలోని క్యాంపు కార్యాలయంలో బీజేపీ దళితమోర్చా నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోనే కాకుండా సీఎం కేసీఆర్‌ చదువుకున్న దుబ్బాకలో కూడా అమలు చేయాలని కోరారు. దుబ్బాకలో మంగళవారం పోచమ్మగుడి వద్ద నిర్వహించే దళితబంధు సాధన దీక్షకు పార్టీలకతీతంగా దళితులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీజేపీ దళిత మోర్చా నాయకులు అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలను అందజేయాలని సూచించారు. అదే సమయంలో హైదరాబాద్‌లో గవర్నర్‌కు కూడా వినతిపత్రాన్ని అందజేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. దుబ్బాకలో నిర్వహించే దళితబంధు సాధన దీక్షకు ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రాములు రానున్నట్లు తెలిపారు. అనంతరం సీపీఐకి రాజీనామా చేసిన మచ్చ శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లి కలిశారు. అలాగే దుబ్బాకలోని పలు వినాయకుడి మండపాల వద్ద పూజలు చేశారు. 13వవార్డులో పలు కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు బాలే్‌షగౌడ్‌, బద్రి, రాజేష్‌, ప్రవీన్‌, రవీందర్‌, నర్సింహులు తదితరులున్నారు.