Advertisement
Advertisement
Abn logo
Advertisement

దళిత మహిళలపై హింసకు నిరసనగా ప్రచారోద్యమం

గుంటూరు(తూర్పు), నవంబరు30: దళిత, గిరిజన స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా 16రోజుల పాటు అంతర్జాతీయ ప్రచారోద్యమం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు దళితస్త్రీ శక్తి జాతీయ కన్వీనర్‌ గెడ్డం ఝాన్సీ అన్నారు. సంఘ ఆధ్వర్యంలో మంగళవారం పంచాయతీరాజ్‌ కాన్ఫరెన్స్‌ హల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రచారోద్యమంలో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, మురికివాడల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ ఏపీడీ కృష్ణవేణి, సంఘ కో-ఆర్డినేటర్లు హేమలత, భాగ్యలక్ష్మి. సుజాత, హేమనిర్మల తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement