ముంచిన వాన..అకాల వర్షాలతో అన్నదాతలకు నష్టం..

ABN , First Publish Date - 2020-10-15T06:41:38+05:30 IST

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా అకాల వర్షం జిల్లాలోని అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. అల్పపీడన ప్రభావం వల్ల జి ల్లా వ్యాప్తంగా కురిసిన భారీ

ముంచిన వాన..అకాల వర్షాలతో అన్నదాతలకు నష్టం..

జిల్లాలో 20 వేల ఎకరాల్లో నేల వాలిన వరి పంట

500 ఎకరాల్లో దెబ్బతిన్న పత్తి 

తడిసిన మొక్కజొన్నతో రైతుల ఆందోళన


(ఆంధ్రజ్యోతి, జగిత్యాల)

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా అకాల వర్షం జిల్లాలోని అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. అల్పపీడన ప్రభావం వల్ల జి ల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరి పంట నేల వా లగా, పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన మొక్కజొన్న  తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో దాదాపు 12 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాలు వేశారు. కానీ క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున పంటకు నష్టం వాటిల్లింది. దాదాపు 20 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను చూస్తే తెలుస్తోంది. జిల్లాలోని మెట్‌పల్లిలో 600 ఎకరాల్లో, కోరుట్లలో 697 ఎకరాల్లో, సారంగాపూర్‌లో 1650 ఎకరాల్లో, జగిత్యాలలో 1210 ఎకరాల్లో, గొల్లపల్లిలో 334 ఎకరాల్లో, మల్లాపూర్‌లో 230 ఎకరాల్లో, వెల్గటూర్‌లో 68 ఎకరాల్లో, కథలాపూర్‌లో 650 ఎకరాల్లో, ధర్మపురిలో 75 ఎకరాల్లో, మల్యాలలో 85 ఎకరాల్లో, ఇబ్రహీంపట్నంలో 450 ఎకరాల్లో, బీరపూర్‌లో 20 ఎకరాల్లో, రాయికల్‌లో 769 ఎకరాల్లో, మేడిపల్లిలో 1356 ఎకరాల్లో, పెగడపల్లిలో 44 ఎకరాల్లో, బుగ్గారంలో 528 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది.


అలాగే జగిత్యాల, వెల్గటూర్‌, బు గ్గారం మండలంలో 150 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాలు వేశారు. వరి పంట కోతకు వచ్చే దశలో భా రీ వర్షాలకు నేల వాలడంతో పంట పూర్తిగా చేతికందే పరిస్థితిలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే 2300 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతింది. చేతికొచ్చిన పంట రేపు మాపు అమ్మకానికి రైతులు సిద్ధమవుతుండగా, వర్షానికి పంట దెబ్బతిందని రైతులు కంటతడి పె ట్టుకున్నారు. జిల్లాలో 834 చెరువులు ఉండగా, వర్షాలకు 513 చెరువులు పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్నాయి. కలెక్టర్‌ రవి ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.


పొంగిపొర్లిన చెరువులు..

జగిత్యాల జిల్లాలో అల్పపీడన ప్రభావం వల్ల కురిసిన వర్షానికి 513 చెరువులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 834 చెరువులు ఉం డగా, 513 చెరువులు వర్షానికి నిండాయి. 213 చెరువుల్లో 75 శాతం నుంచి 100 శాతం మేరకు నీరు చేరుకోగా, 73 చెరువుల్లో 75 శాతంలో పు నీరు, 20 చెరువుల్లో 50 శాతంలోపు నీరు, 15 చెరువుల్లో 20 శాతం లోపు నీరు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. నిండిన చెరువుల వద్ద కట్టలు తెగిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


జిల్లావ్యాప్తంగా వర్షం..

జగిత్యాలలో 10.2 మిల్లీ మీటర్లు, సారంగాపూర్‌లో 8.2 మిల్లీ మీటర్లు, మల్యాలలో 13.2 మిల్లీ మీటర్లు, గొల్లపల్లిలో 6.8 మిల్లీ మీటర్లు, పెగడపల్లిలో 15.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కొడిమ్యాలలో 33.8 మిల్లీ మీటర్లు, వెల్గటూర్‌లో 6.6 మిల్లీ మీటర్లు, కోరుట్లలో 4.8 మిల్లీ మీటర్లు, మేడిపల్లిలో 4.2 మిల్లీ మీటర్లు, ఇబ్రహీంపట్నంలో 4 మిల్లీ మీటర్లు, కథలాపూర్‌లో 6.2 మిల్లీ మీటర్లు, మల్లాపూర్‌లో 2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

Updated Date - 2020-10-15T06:41:38+05:30 IST