ఇస్కాన్‌లో దామోదర మాసోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-25T05:39:00+05:30 IST

దామోదర మాసోత్సవాలు సాగర్‌నగర్‌లోని ఇస్కాన్‌ మందిరంలో ఆదివారం ప్రారంభమయ్యాయి.

ఇస్కాన్‌లో దామోదర మాసోత్సవాలు ప్రారంభం
అలంకృతులైన రాధాకృష్ణులు

సాగర్‌నగర్‌, అక్టోబరు 24: దామోదర మాసోత్సవాలు సాగర్‌నగర్‌లోని ఇస్కాన్‌ మందిరంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇస్కాన్‌ విశాఖపట్నం అధ్యక్షుడు సాంబదాస్‌, మాతాజీ నితాయిసేవని నేతృత్వంలో ఈ ఉత్సవాలు నవంబరు 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం మంగళహారతి, నరసింహా హారతి, తులసి హారతి, నేతితో దీపారాధన సమర్పణ చేశారు. గజేంద్రస్తుతి, దామోదరాష్టకం, గోపీ గీత, భగవద్గీత 12వ అధ్యాయం, తదితరమైని పారాయణం పటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-25T05:39:00+05:30 IST