వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు మద్దతుగా మోదీపై సీతక్క సెటైర్లు

ABN , First Publish Date - 2021-03-10T21:27:57+05:30 IST

వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్మికుల ఉద్యమానికి తెలంగాణ నుంచి కూడా మద్దతు...

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు మద్దతుగా మోదీపై సీతక్క సెటైర్లు

ఇంటర్నెట్ డెస్క్: వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్మికుల ఉద్యమానికి తెలంగాణ నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. ట్విటర్ వేదికగా స్పందించిన ఆమె.. తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై సెటైర్ల వర్షం కురిపించారు. చాయ్‌వాలా, కాపలాదారుడు నుంచి సేల్స్‌మన్‌గా ప్రధాని మోదీ మారిన తీరును తాను గుర్తించానని ఆమె అన్నారు. ‘‘మోదీజీ మీరు పీఎం, సేల్స్‌మన్ కాదు. మా జన్మహక్కులను కాలరాస్తుంటే ఇంట్లో కూర్చొని ఉండలేము. వైజాగ్ ప్రజలారా.. స్టీల్ ప్లాంట్‌పై ఇంచు కూడా వెనకడగు వేయకండి.. మీకు మద్దతుగా నేనున్నాను’’ అని ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-03-10T21:27:57+05:30 IST