కోనసీమలో ప్రమాద ఘంటికలు

ABN , First Publish Date - 2021-04-17T06:37:24+05:30 IST

కొవిడ్‌ వైరస్‌ కోనసీమను మరోసారి వణికిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ బాధితులను ఆదుకునే చర్యలు ప్రభుత్వం చేపట్టకపోవడం పట్ల ప్రజల్లో తీవ్రమైన భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

కోనసీమలో ప్రమాద ఘంటికలు

  • రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు 
  • ప్రైవేటు ల్యాబ్‌లలో భారీగా కొవిడ్‌ టెస్ట్‌లు
  • కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు బాధితుల డిమాండ్‌  
  • శుక్రవారం ఒక్కరోజునే 102 కేసుల నమోదు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

 కొవిడ్‌ వైరస్‌ కోనసీమను మరోసారి వణికిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ బాధితులను ఆదుకునే చర్యలు ప్రభుత్వం చేపట్టకపోవడం పట్ల ప్రజల్లో తీవ్రమైన భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గతం కంటే భిన్నంగా ఈసారి చాపకింద నీరులా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగిస్తోంది. కొందరు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తే మరికొందరు ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకుని పాజిటివ్‌ అని తేలినప్పటికీ తగినన్ని జాగ్ర త్తలు తీసుకోకపోవడం వల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ అనూ హ్యంగా విజృంభిస్తోంది. అయితే గతంలో మాదిరిగా  కరోనా బాధితుల కోసం ప్రభుత్వ పరంగా ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో బాధి తులు ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్యాకేజీలు మాట్లాడుకుని చేరుతున్నారు. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం జిల్లా వ్యాప్తంగా 750 కేసులు నమోదయ్యాయి. కోనసీమలో అయితే శుక్ర వారం బులెటిన్‌ ప్రకారం 102 కేసులు నమోదు కాగా వాటిలో అత్య ధికంగా అమలాపురం పరిసర ప్రాంతాల్లో 51 కేసులు నమోదయ్యాయి.  కోనసీమలో గత మార్చి నుంచి ఇప్పటి వరకు 25,159 కేసులు నమో దుకాగా వాటిలో 235 మరణాలు ఉన్నాయి. శుక్రవారం అమలాపురం మండలంలో 51, రాజోలులో 26, మలికిపురం 9, కొత్తపేట 10, అయి నవిల్లి 5, సఖినేటిపల్లిలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. ప్రస్తుతం అమలాపురం ఏరియా ఆసుపత్రితో పాటు కిమ్స్‌ మెడికల్‌ కళాశాలలో బెడ్స్‌ను ప్రభుత్వపరంగా కేటాయించినప్పటికి ఆక్సిజన్‌ లెవల్స్‌ బాగా తగ్గుతున్న బాధితులకు మాత్రమే అడ్మిషన్లు లభిస్తున్నాయి. మిగిలిన వారు ఇళ్లకు పరిమితం అవుతున్నారు. అయితే పాజిటివ్‌ కేసుల సమా చారం ప్రభుత్వ అధికారులకు తెలిసినప్పటికీ రక్షణ చర్యలు కానీ, పారి శుధ్య నిర్వహణ కానీ, ఇతర జాగ్రత్తలు తీసుకునే పరిస్థితులు ఎక్కడా లేవు. ఇక ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలతోపాటు స్కానింగ్‌ల ద్వారా కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. 

  • కొవిడ్‌ సెంటర్లు ఎక్కడ..?

జిల్లాలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తున్నప్పటికీ కొవిడ్‌ కేర్‌సెంటర్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసిందీ ఇప్పటికీ ప్రకటించకపోవడం బాధితుల్లో ఆందోళన కలిగించింది. గతంలో రాజమహేంద్రవరంలోని బొమ్మూరు, అమలాపురం సమీపంలోని బోడసకుర్రు టిడ్కో గృహాలను కొవిడ్‌కేర్‌ సెంటర్లుగా మార్చారు. అయితే వాటిని రద్దుచేసి ఆ టిడ్కో గృహాలను ఇటీవల ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసింది. దాంతో ఇప్పుడు అనూహ్యంగా పెరుగుతున్న కొవిడ్‌ కేసుల బాధితులకు కనీస కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయకుండా చోద్యం చూస్తున్న తీరుపై ఆగ్ర హావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఐసీఎంఆర్‌ మార్గదర్శకా లను అనుసరించి పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య మాత్రమే రోజువారీగా విడుదల చేస్తున్నప్పటికీ అంతకుమించి మూడు, నాలుగు రెట్లు కేసులు ప్రైవేటు ల్యాబ్‌ల ద్వారా నిర్థారణ అవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. 

Updated Date - 2021-04-17T06:37:24+05:30 IST