దంగేరు గ్రామ సమగ్రాభివృద్ధికి సహకరించండి

ABN , First Publish Date - 2021-10-23T06:07:06+05:30 IST

దంగేరు గ్రామ సమగ్రాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకరించాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పిలుపునిచ్చారు.

దంగేరు గ్రామ సమగ్రాభివృద్ధికి సహకరించండి

కె.గంగవరం, అక్టోబరు 22: దంగేరు గ్రామ సమగ్రాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకరించాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం దంగేరు ఉన్నత పాఠశాల ఆవరణలో సర్పంచ్‌ కొప్పిశెట్టి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఆదర్శ గ్రామయోజన పథకంలో  దంగేరు, బాపనయ్యచెరువు, తణుకువాడ, పల్లి పాలెం, వెల్ల, టేకి గ్రామాలను ఎంపికచేశారని, తొలుత దంగేరును ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్య అతి థిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ తాను బోస్‌ మార్గంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. ఎంపీ బోస్‌ను ఘనంగా సన్మానించారు. ఆదర్శగ్రామాల నోడల్‌ అధికారి రమణి, ఆర్డీవో సింధు, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ ఎస్‌ఈ ఎం.శ్రీనివాసు, డీఈ డి.శ్రీనివాసరావు, ఏఈ అనిల్‌కుమార్‌, ఎంపీడీవో వి.అబ్రహంలింకన్‌, ఏఎంసీ చైర్మన్‌ పండు గోవిందరాజు, జడ్పీటీసీ ఒబిళినేని శ్రీవరలక్ష్మి, ఎంపీటీసీ కొప్పిశెట్టి వెంకటరామలక్ష్మణరావు, వైసీపీ నాయకులు పిల్లి సుర్యప్రకాష్‌, చెల్లుబోయిన నరేన్‌, వట్టికూటి సూర్యచంద్రరాజశేఖర్‌, పెట్టా శ్రీనివాసరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-23T06:07:06+05:30 IST