హోటల్ గదిలోనూ కిట్ ధరించి స్టీవ్ స్మిత్ బ్యాటింగ్

ABN , First Publish Date - 2021-01-07T17:51:58+05:30 IST

ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ భార్య డేనీ విలిస్ ఒక ఆసక్తికర వీడియోను సోషల్ మీడియలో షేర్ చేశారు.

హోటల్ గదిలోనూ కిట్ ధరించి స్టీవ్ స్మిత్ బ్యాటింగ్

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ భార్య డేనీ విలిస్ ఒక ఆసక్తికర వీడియోను సోషల్ మీడియలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన అభిమానులు క్రికెట్‌పై స్మిత్ చూపే అంకితభావానికి తెగమురిసిపోతున్నారు. డేనీ షేర్ చేసిన ఆ వీడియోలో స్మిత్ పూర్తిస్థాయిలో క్రికెట్ కిట్ ధరించి, బ్యాటింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోను షేర్ చేసిన డేనీ... ‘క్రిస్మస్ సాయంత్రం వేళ ఒక పిల్లాడి మాదిరిగా’ అని కామెంట్ రాశారు. అలాగే ఈ వీడియో కింద స్మిత్... ‘అప్పుడప్పుడు అనుభూతి చెందేందుకు పూర్తిస్థాయిలో కిట్ ధరించి షాడో బ్యాటింగ్ చేయాల్సివుంటుంది’ అని రాశారు.

Updated Date - 2021-01-07T17:51:58+05:30 IST