Darjeeling: నేటినుంచి టాయ్ ట్రైన్ పునర్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-25T16:16:06+05:30 IST

న్యూ జల్పాయిగురి- డార్జిలింగ్ నగరాల మధ్య టాయ్ ట్రైన్ బుధవారం పట్టాలెక్కింది....

Darjeeling: నేటినుంచి టాయ్ ట్రైన్ పునర్ ప్రారంభం

డార్జిలింగ్ (పశ్చిమబెంగాల్): న్యూ జల్పాయిగురి- డార్జిలింగ్ నగరాల మధ్య టాయ్ ట్రైన్ బుధవారం పట్టాలెక్కింది.కరోనా వైరస్ మహమ్మారి వల్ల గత ఏడాది మార్చి 22వతేదీ నుంచి ఈ టాయ్ ట్రైన్ రాకపోకలను నిలిపివేశారు. కరోనా కేసుల సంఖ్య తగ్గడంతోపాటు ఏడాదిన్నర కాలం తర్వాత పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దుర్గా పూజ ప్రారంభానికి ముందు ఈ టాయ్ ట్రైన్ మళ్లీ బుధవారం నుంచి రాకపోకలు సాగించింది.డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే నడుపుతున్న టాయ్ ట్రైన్ ను యునెస్కో వరల్డ్ హెరిటైజ్ సైట్ గా ప్రకటించింది. 


న్యూజల్పాయిగురి నుంచి డార్జిలింగ్ వరకు 88 కిలోమీటర్ల దూరం న్యారో గేజ్ రైల్వే లైన్ ను 1879 -1881 ల మధ్య బ్రిటీష్ వారు నిర్మించారు.దీంతోపాటు డార్జిలింగ్ నుంచి కుర్సాంగ్ వరకు పాతకాలపు ఆవిరి లోకోమోటివ్ రైలును పునర్ ప్రారంభించారు.డార్జిలింగ్ రైలులో ఫస్ట్ క్లాసులో 17, సాధారణ తరగతిలో 29 సీట్లున్నాయి. హిల్ స్టేషన్ రైల్వే సేవల పునర్ ప్రారంభంతో పర్యాటక రంగానికి ఊపు రానుంది. రైలు బోగీలను శుభ్రం చేసి శానిటైజ్ చేసి నడిపారు.టాయ్ ట్రైన్ లో ప్రయాణించే వారు విధిగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అధికారులు చెప్పారు. 

Updated Date - 2021-08-25T16:16:06+05:30 IST