Abn logo
Aug 2 2021 @ 00:54AM

జాతీయ రహదారిపై అంధకారం

లైట్లు వెలగక నర్సీపట్నం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై అంధకారం


  వెలగని లైట్లు 

 సర్వీసు రోడ్లలోనూ ఇదే పరిస్థితి 

  పట్టించుకోని హైవే అధికారులు 

 భయం.. భయంగా  జనం రాకపోకలు

పాయకరావుపేట, ఆగస్టు 1 : పట్టణ పరిధిలో ఉన్న జాతీయ రహదారిపై తరచూ అంధకారం అలము కుం టోంది. లైట్లు సరిగా వెలగకపోవడంతో రాకపోకలకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ముఖ్యంగా ఇక్కడి నర్సీపట్నం జంక్షన్‌ వద్ద జాతీయ రహ దారితో పాటు రైల్వే వంతెనకు ఇరు వైపులా ఉన్న సర్వీసు రోడ్లపై గత రెండు వారాలుగా రాత్రి సమయంలో లైట్లు వెలగక ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. తాండవ వంతెన నుంచి  నామవరం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న రహదారిపై పలు జం క్షన్ల వద్ద ఏర్పాటు చేసిన లైట్లు రాత్రి పూట వెలగడం లేదు. అదేవిధంగా పలు జంక్షన్ల వద్ద ఉన్న సర్వీసు రోడ్లపై కూడా లైట్లు తరచూ మొరాయిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో చీకటి అలుముకుం టున్నాయి. దీంతో ఈ రోడ్లలో రాత్రివేళ పాదచారులు, సైక్లిస్టులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జాతీయ రహదారిపై తరచూ లైట్లు వెలగకపోవడంతో వాహనం దగ్గరకు వచ్చేంత వరకు గుర్తించడం కష్టంగా ఉంటోందని అంటు న్నారు. ఇప్పటికైనా హైవే అథారిటీ అధికారులు స్పందించి జాతీయ రహదారితో పాటు సర్వీసు రోడ్లపైనా రాత్రి సమయాల్లో వీధి లైట్లు వెలిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.