నేటి నుంచి వేయిస్తంభాల గుడి దర్శనం బంద్‌

ABN , First Publish Date - 2021-04-22T05:34:18+05:30 IST

నేటి నుంచి వేయిస్తంభాల గుడి దర్శనం బంద్‌

నేటి నుంచి వేయిస్తంభాల గుడి దర్శనం బంద్‌

వరంగల్‌ కల్చరల్‌, ఏప్రిల్‌ 21: కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో హన్మకొండలోని వేయిస్తంభాల గుడిలో ఈ నెల 22 నుంచి మే 15వ తేదీ వరకు భక్తులకు అనుమతి లేదని భారత పురావస్తు శాఖ కన్సర్వేషన్‌ అసిస్టెంట్‌ మల్లేశం, ఆలయ ఈవో పి.వేణుగోపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. భారత పురాతత్వ పర్యవేక్షణ పరిధిలోని కట్టడాల్లో భక్తులకు అనుమతి ఇవ్వొద్దని పురావస్తు శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు. దేవాదాయ శాఖ అర్చకులు, సిబ్బంది మాత్రమే నిత్య ఆరాధనలు, అభిషేకాలు నిర్వహిస్తారని తెలిపారు.

Updated Date - 2021-04-22T05:34:18+05:30 IST