chennai: ఆయుధపూజకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-10-14T15:53:31+05:30 IST

ఆయుధపూజ, విజయదశమి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపు కొనేందుకు రాష్ట్రం సిద్ధమైంది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కాస్త సడలింపు వస్తున్న నేపథ్యంలో.. పండుగను ఘనంగా జరుపు

chennai: ఆయుధపూజకు సర్వం సిద్ధం

           - మార్కెట్లలో కొనుగోలుదారుల రద్దీ 

           - రెండింతలు పెరిగిన పూలు, పూజా సామగ్రి ధరలు


ప్యారీస్‌(చెన్నై): ఆయుధపూజ, విజయదశమి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపు కొనేందుకు రాష్ట్రం సిద్ధమైంది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కాస్త సడలింపు వస్తున్న నేపథ్యంలో.. పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. గురు, శుక్రవారాల్లో ఈ పండుగ ను జరుపు కోనున్న నేపథ్యంలో, ఈ ఏడాది పూల ధరలు, పూజా సామగ్రి ధరలు రెండింతలు పెరిగాయి. ప్రజలు ధరల గురించి పట్టించుకోకుండా పూజల్లో నివేదించే బొరుగులు, అటు కులు, బెల్లం, మిఠాయిలు, మామిడి, అరటి తోరణాలు తదితర సామగ్రిని కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు తరలివెళ్తున్నారు. కోయంబేడులోని హోల్‌ సేల్‌ పూల మార్కెట్‌, ప్యారీస్‌లోని ఫ్లవర్‌ బజార్‌ సహా నగరంలోని సంత వీధులు పండుగ సామగ్రి కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తున్నాయి. మల్లెపూలు కిలో రూ.800 నుంచి రూ.1,000 వరకు, చామంతి రూ.240, కనకాంబరం రూ.800, గులాబీలు రూ.150 నుంచి రూ.200 ధర పలుకుతున్నాయి. ఇక, పండ్ల ధరలు కూడా 10 శాతం పెరిగాయి. బత్తాయి కిలో రూ.30 నుంచి రూ.60, దానిమ్మ రూ.120 నుంచి రూ.150, ఆరంజ్‌ రూ.30 నుంచి రూ.50, ఆపిల్‌ రూ.100 నుంచి రూ.150, అరటి గెల రూ.150 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. దసరా పండుగ చివరి రోజైన విజయదశమి నాడు పూజల అనంతరం దిష్టి తీసే గుమ్మడికాయ ధర కూడా రూ.30 నుంచి రూ.60కి ధర పలుకుతోంది. కాగా, పండుగను సొంతూళ్లలో జరుపుకొనేందుకు ప్రభుత్వ రవాణా సంస్థలు, ప్రైవేటు సంస్థలు నడుపుతున్న బస్సుల్లో రద్దీ నెలకొంది.


నేతల శుభాకాంక్షలు... 

దసరా పండుగ జరుపుకోనున్న తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రజలకు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త ఒ. పన్నీర్‌సెల్వం, సమ త్తువ మక్కల్‌ కట్చి నేత శరత్‌కుమార్‌, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌, న్యూ జస్టిస్‌ పార్టీ అధ్యక్షుడు ఏసీ షణ్ముగం తదితర ప్రముఖులు వేర్వేరుగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - 2021-10-14T15:53:31+05:30 IST