వైభవంగా ముగిసిన దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-10-17T04:20:10+05:30 IST

విజయదశమి వేడుకలు ఘనంగా ముగిశాయి.

వైభవంగా ముగిసిన దసరా ఉత్సవాలు
దువ్వలోని దానేశ్వరి అమ్మవారి తెప్పోత్సవం

వేడుకగా అమ్మవార్ల ఊరేగింపులు... తెప్పోత్సవాలు

 తీన్‌మార్‌ డప్పులతో హోరెత్తిన వీధులు

పెంటపాడు, అక్టోబరు 16: మండలంలో విజయదశమి వేడుకలు ఘనంగా ముగిశాయి. మౌంజీపాడులోని కనకదు ర్గమ్మ అలయంలో అమ్మవారిని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  తెలుగురైతు మండల అధ్యక్షుడు బుద్దన ధనరాజు, సత్యపుణ్యవతి దంపతుల ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంట్‌ తెలుగురైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి, మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, తెలుగు యువత గూడెం నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్‌, కే.పెంటపాడు గ్రామ సర్పంచ్‌ పీతల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు వై.జంక్షన్‌ వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శన మిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు కొత్తలంక శివసత్యనారాయణ బ్రహ్మత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తణుకు: దువ్వలోని దానేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి అమ్మవారి తెప్పోత్సవం వయ్యేరు కాల్వలో అత్యంత వైభవంగా నిర్వహించారు.  తెప్పను పచ్చిపూలతో అలంకరించారు.కార్యక్రమంలో ఎమ్మెల్మే కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సర్పంచ్‌ అడ్డాబాబు, ఎంపీపీ ధనరాజు, ఈవో చందక దారబాబు పాల్గొన్నారు

నిడదవోలు: తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ అమ్మ వారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరి గాయి. తొమ్మిది రోజులు ప్రత్యేక కుంకుమ పూజల ద్వారా రూ.5,65,600, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.2,48,940, ఫొటోల అమ్మకం ద్వారా రూ.90,701, విరాళాల ద్వారా రూ.24,090, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.4,25,575, నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.2,99,415, పూజా టికెట్ల ద్వారా రూ.74,680/–లు మొత్తం రూ.17,29,001 ఆదాయం లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ల నీలకంఠం (శివ) తెలిపారు.  

నిడమర్రు: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యం త వైభవంగా నిర్వహించబడ్డాయి. మందలపర్రు ఉమానీ లకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో ఉమాదేవి అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శమీవృక్ష పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గల కోనేరులో పల్లకి ఉత్సవం, బాణసంచాతో అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. 

గణపవరం: గణపవరంలోని కంచికామాక్షి కనకదుర్గమ్మ ఆలయంలో అధ్యక్షుడు తెలగారెడ్డి బాబీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం రాత్రి బాణసంచా కాల్పుల నడమ అమ్మవారికి బాలయ్య చెరువులో తెప్పో త్సవం వైభవంగా నిర్వహించారు. చినరామచంద్రపు రంలో కనకదుర్గమ్మ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్‌ కాకర్ల విష్ణు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం దసరా ముగింపు వేడుకల సందర్భంగా అర్థవరం గ్రామంలో భవానీలు ఊరేగించారు. తీన్మార్‌ డబ్బులు, శక్తివేషా లతో ఊరేగింపు నిర్వహించారు. పలు గ్రామాల్లో అమ్మవార్ల ఊరేగింపులు జరిగాయి. 

ఉండ్రాజవరం: మండలంలో శుక్రవారం విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాలంగి, ఉండ్రాజవరం, మోర్త, వేలివెన్ను, కాల్థరి, తాడిపర్రు తదితర గ్రామాల్లో కనకదుర్గ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారిని గ్రామాల్లో ఊరేగించారు.  వేషధారణలు, బ్యాండుమేళాలు, తీన్‌మార్‌ డప్పులతో ఘనంగా ఊరేగించారు. భవాని భక్తులు భజనలు చేశారు. 




Updated Date - 2021-10-17T04:20:10+05:30 IST