అన్నీ ఫుల్‌!

ABN , First Publish Date - 2021-10-09T07:00:18+05:30 IST

దసరా సమీపించడంతో అప్పుడే అన్ని రవాణా వ్యవస్థలు టిక్కెట్‌ బుకింగ్‌లతో రద్దీగా మారాయి. పండగకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారికి ఛార్జీలు అప్పుడే షాక్‌ కొడుతున్నాయి. రైళ్లు.. విమానాలు.. బస్సులు వేటికవే సీట్లు నిండిపోయి బెర్త్‌లు దొరకని పరిస్థితి నెలకొంది. అటు తిరుగు ప్రయాణంలోను విమానాలు, రైళ్లలో అప్పుడే సీట్లు రిజర్వు అయిపోయాయి. రైళ్లలో అయితే వెయింటింగ్‌ లిస్ట్‌లు వందల్లో ఉన్నాయి. విమానాలకు అయితే ఎనిమిది వేలకుపైన, రైళ్లయితే తత్కాల్‌ కోటా మినహా టిక్కెట్లు దొరికేలా కనిపించడం లేదు. అటు ప్రైవేటు బస్సు సర్వీసులు అయితే ఇదే అదనుగా రెట్టింపు రేట్లు వసూలు చేస్తూ షాక్‌ ఇస్తున్నాయి. ఆర్టీసీ కూడా అదే దారిలో పయనిస్తోంది.

అన్నీ ఫుల్‌!

దసరా పండుగకు అప్పుడే విమానాలు, 

రైలు టిక్కెట్లు నిల్‌

ఆదివారం నుంచి హైదరాబాద్‌ నుంచి 

ఇండిగో టిక్కెట్‌ ధర రూ.6,700పైనే

పండగ తర్వాత 16 నుంచి ఈ రూట్లో 

అప్పుడే రూ.6 వేలకుపైనే ఛార్జీలు

హైదరాబాద్‌-రాజమహేంద్రవరం మధ్య 

ఈనెల 10 తర్వాత 12 రైళ్లలో నో బెర్త్‌లు 

హైదరాబాద్‌ నుంచి మన జిల్లాకు 

ప్రైవేటు ట్రావెల్స్‌ రూ.1700పైనే బాదుడు

సర్వీసులు రెట్టింపు పెంచి బాదేస్తున్న 

ప్రైవేటు బస్సులు.. ఆర్టీసీదీ అదే దారి

దసరా సమీపించడంతో అప్పుడే అన్ని రవాణా వ్యవస్థలు టిక్కెట్‌ బుకింగ్‌లతో రద్దీగా మారాయి. పండగకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారికి ఛార్జీలు అప్పుడే షాక్‌ కొడుతున్నాయి. రైళ్లు.. విమానాలు.. బస్సులు వేటికవే సీట్లు నిండిపోయి బెర్త్‌లు దొరకని పరిస్థితి నెలకొంది. అటు తిరుగు ప్రయాణంలోను విమానాలు, రైళ్లలో అప్పుడే సీట్లు రిజర్వు అయిపోయాయి. రైళ్లలో అయితే వెయింటింగ్‌ లిస్ట్‌లు వందల్లో ఉన్నాయి. విమానాలకు అయితే ఎనిమిది వేలకుపైన, రైళ్లయితే తత్కాల్‌ కోటా మినహా టిక్కెట్లు దొరికేలా కనిపించడం లేదు. అటు ప్రైవేటు బస్సు సర్వీసులు అయితే ఇదే అదనుగా రెట్టింపు రేట్లు వసూలు చేస్తూ షాక్‌ ఇస్తున్నాయి. ఆర్టీసీ  కూడా అదే దారిలో పయనిస్తోంది.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

దసరా పండుగ ఈనెల 15న కావడంతో జిల్లావాసులు అనేక ప్రాంతాల నుంచి సొంతూర్లకు వస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు టిక్కెట్‌ బుకింగ్‌ల కోసం ప్రయత్నిస్తుంటే ఛార్జీలు షాక్‌ కొడుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి ఇండిగో విమాన సర్వీసు ఒక్కటే ఉంది. ఇందులో ప్రయాణించాలంటే టిక్కెట్‌కు రూ.7 వేల వరకు ధర చెల్లించాల్సిన పరిస్థితి. సాధారణ రోజుల్లో ఈ రూట్లో టిక్కెట్‌ రూ.3,426 మాత్రమే. కానీ ఈనెల పది నుంచి హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి టిక్కెట్‌ ధర రూ.7,288గా ఉంది. ఈనెల 11న రూ.6,028, 12న రూ.5,293, 14న రూ.6,028 వరకు పెరిగిపోయాయి. ప్రయాణ తేదీ దగ్గరపడే కొద్దీ ఈ ధరలు మరింత పెరగనున్నాయి. అలాగే ఆదివారం నుంచి రాజమహేంద్రవరం-హైదరాబాద్‌ మధ్య ఇండిగో ఛార్జీ రూ.6,789గా ఉంది. 11న రూ.6,159, 12న రూ.5,424, 13న రూ.4,794 ఉంది. ఆ తర్వాత మళ్లీ రూ.3,426 మాత్రమే. పండగ తర్వాత తిరుగు ప్రయాణంలో రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ మధ్య ఇండిగో ఛార్జీలు అప్పుడే రూ.6 వేల వరకు పలుకుతున్నాయి.

రైళ్ల విషయానికి వస్తే హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవ రం, కాకినాడకు వచ్చే బండ్లన్నీ ఈనెల 10 తర్వాత వెయిటింగ్‌ లిస్టు చూపిస్తున్నాయి. ఈ రూట్లో మొత్తం 12 రైళ్లు ప్రయాణిస్తే అన్ని తరగతుల సీట్లన్నీ రిజర్వు అయిపోయాయి. గరీబ్‌రథ్‌, హైదరాబాద్‌-విశాఖ స్పెషల్‌, హైదరాబాద్‌-కాకినాడ,హైదరాబాద్‌-హౌరా తదితర రైళ్లన్నీ వందల్లో వెయిటింగ్‌ లిస్టులు చూపిస్తున్నాయి. టిక్కెట్‌ బుకింగ్‌ కౌంటర్లలో వీటికి రిజర్వేషన్లు కూడా నిలిపివేశారు. దసరా అయ్యాక ఈనెల 17 నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలోను 15 రైళ్లలో సీట్లన్నీ వెయిటింగ్‌ లిస్టులు ప్రదర్శిస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం, కాకినాడకు పండగకు ముందు రావాలంటే ప్రైవేటు బస్సులు కూడా అప్పుడే బాదేస్తున్నాయి. ఈ రూట్లో సాధారణ రోజుల్లో 30 వరకు బస్సులు నడుస్తుంటే, పండగ పేరుతో 69 ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. ఇవి దసరాకు టిక్కెట్‌ ధర రూ.1,700 నుంచి రూ.2,200 వరకు పిండుతున్నాయి. ఆర్టీసీలో కూడా వెయ్యి వరకు లాగుతున్నాయి. ఇలాగే తిరుగు ప్రయాణా ల్లోనూ చార్జీల బాదుడు గట్టిగానే ఉంటోంది.

Updated Date - 2021-10-09T07:00:18+05:30 IST