‘దసరా’ స్పెషల్స్

ABN , First Publish Date - 2020-10-21T17:09:20+05:30 IST

విజయదశమి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి..

‘దసరా’ స్పెషల్స్

నిజాముద్దీన్‌, చెన్నై, విజయవాడ, కడప తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు 


విశాఖపట్నం: విజయదశమి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి  ప్రకటన విడుదల చేశారు. విశాఖ-నిజాముద్దీన్‌-విశాఖ: 02887 నంబర్‌ గల రైలు (వయా రాయ్‌పూర్‌) మంగళవారం నుంచి నవంబరు 29 వరకు ప్రతి మంగళ, బుధ, గురు, శని, ఆదివారాల్లో ఉదయం 6:25 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు సాయంత్రం 4:45 గంటలకు నిజాముద్దీన్‌ చేరుతుంది. 02888 నంబర్‌ గల రైలు (వయా రాయ్‌పూర్‌) గురు, శుక్ర, శని, సోమ, మంగళవారాల్లో ఉదయం 8.45 గంటలకు నిజాముద్దీన్‌లో బయలుదేరి మరునాడు సాయంత్రం 6.10 గంటలకు విశాఖ చేరుతుంది. 02851 నంబర్‌ గల రైలు (వయా విజయవాడ) ఈ నెల 23 నుంచి నవంబరు 27 వరకు ప్రతి సోమ, శుక్రవారాల్లో ఉదయం 8:20 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు సాయంత్రం 5:10 గంటలకు నిజాముద్దీన్‌ చేరుతుంది. 02852 నంబర్‌ గల రైలు ఈ నెల 25 నుంచి నవంబరు 29 వరకు ప్రతి బుధ, ఆదివారాల్లో ఉదయం 5:50 గంటలకు నిజాముద్దీన్‌లో బయలుదేరి మర్నాడు సాయంత్రం 5:30 గంటలకు విశాఖ చేరుతుంది.


విశాఖ-చెన్నై-విశాఖ: 02869 నంబర్‌ గల రైలు ఈ నెల 26 నుంచి.. నవంబరు 30 వరకు ప్రతి సోమవారం రాత్రి 7:05 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు ఉదయం 8:55 గంటలకు చెన్నై చేరుతుంది. 02870 నంబర్‌ గల రైలు ఈ నెల 27 నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు ప్రతి మంగళవారం రాత్రి 9:10 గంటలకు చెన్నైలో బయలుదేరి మర్నాడు ఉదయం 10.25 గంటలకు విశాఖ చేరుతుంది.


విశాఖ-లోకమాన్య తిలక్‌-విశాఖ: 02857 నంబర్‌ గల రైలు ఈ నెల 25 నుంచి నవంబరు 29 వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:00 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 1:35 గంటలకు లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌కు చేరుతుంది. 02858 నంబర్‌ గల రైలు ఈ నెల 27 నుంచి డిసెంబరు ఒకటి వరకు ప్రతి మంగళవారం 00.15 (సోమవారం అర్ధరాత్రి 12.15) గంటలకు లోకమాన్య తిలక్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 5:20 గంటలకు విశాఖ చేరుతుంది.


విశాఖ-గాంధీథాం-విశాఖ: 08501 నంబర్‌ గల రైలు ఈనెల 22 నుంచి నవంబరు 26 వరకు ప్రతి గురువారం సాయంత్రం 5.35 గంటలకు విశాఖలో బయలుదేరి మూడో రోజు ఉదయం 9.00 గంటలకు గాంధీథాం చేరుతుంది. 08502 నంబర్‌ గల రైలు ఈ నెల 25 నుంచి నవంబరు 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం రాత్రి 10:45 గంటలకు గాంధీథాంలో బయలుదేరి మూడో రోజు మధ్యాహ్నం 2:35 గంటలకు విశాఖ చేరుతుంది.


విశాఖ-కడప-విశాఖ (వయా తిరుపతి): 07488 నంబర్‌ గల రైలు ఈ నెల నవంబరు 30 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2:00 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు ఉదయం 7:25 గంటలకు కడప చేరుతుంది. 07487 నంబర్‌ గల రైలు ఈ నెల 21 నుంచి డిసెంబరు ఒకటి వరకు ప్రతిరోజు సాయంత్రం 5:05 గంటలకు కడపలో బయలుదేరి మర్నాడు ఉదయం 11:30 గంటలకు విశాఖ చేరుతుంది.


విశాఖ-విజయవాడ డబుల్‌ డెక్కర్‌: 02705 నంబరు గల డబుల్‌ డెక్కర్‌ రైలు నవంబరు 30 వరకు ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 5:45 గంటలకు విశాఖలో బయలుదేరి 11:15 గంటలకు విజయవాడ చేరుతుంది. 02706 నంబర్‌ గల రైలు నవంబరు 30 వరకు ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో సాయంత్రం 5:30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 11:00 గంటలకు విశాఖ చేరుతుంది. 


భువనేశ్వర్‌-తిరుపతి-భువనేశ్వర్‌ (వయా విశాఖ): 08479 నంబర్‌ గల రైలు ఈనెల 24 నుంచి నవంబరు 28వ తేదీ వరకు ప్రతి శనివారం, తిరుగు ప్రయాణంలో 08480 నంబర్‌ గల రైలు ఈనెల 23 నుంచి నవంబరు 27వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. 


భువనేశ్వర్‌-చెన్నై-భువనేశ్వర్‌: 02839 నంబరు గల రైలు ఈనెల 22 నుంచి నవంబరు 26వ తేదీ వరకు ప్రతి గురువారం, తిరుగు ప్రయాణంలో 02840 నంబర్‌ గల రైలు ఈనెల 23 నుంచి నవంబరు 27వ తేదీ వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటాయి. 


భువనేశ్వర్‌-బెంగళూరు-భువనేశ్వర్‌: 02845 నంబరు గల రైలు ఈనెల 25 నుంచి నవంబరు 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం, తిరుగు ప్రయాణంలో 02846 నంబర్‌ గల రైలు ఈనెల 27 నుంచి డిసెంబరు ఒకటి వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయి.


భువనేశ్వర్‌-పాండిచ్చేరి-భువనేశ్వర్‌: 02898 నంబర్‌ గల రైలు ఈ నెల 20 నుంచి నవంబరు 24వ తేదీ వరకు ప్రతి మంగళవారం, తిరుగు ప్రయాణంలో 02899 నంబర్‌ గల రైలు ఈ నెల 21 నుంచి నవంబరు 25వ తేదీ వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటాయి.


భువనేశ్వర్‌-రామేశ్వరం-భువనేశ్వర్‌: 08496 నంబర్‌ గల రైలు ఈనెల 23 నుంచి నవంబరు 27వ తేదీ వరకు ప్రతి శుక్రవారం, తిరుగు ప్రయాణంలో 08495 నంబర్‌ గల రైలు ఈనెల 25 నుంచి నవంబరు 29వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటలో ఉంటాయి.


పూరి-చెన్నె-పూరి: 02859 నంబర్‌ గల రైలు ఈనెల 25 నుంచి నవంబరు 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం, తిరుగు ప్రయాణంలో 02860 నంబర్‌ గల రైలు ఈనెల 26 నుంచి నవంబరు 30వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటాయి.


ప్రత్యేక బస్సులు 330

ద్వారకా బస్‌స్టేషన్‌, అక్టోబరు 20: దసరాను పురస్కరించుకుని 330 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు పీటీడీ విశాఖ రీజనల్‌ మేనేజర్‌ ఎంవై దానం తెలిపారు. విశాఖ నుంచి విజయవాడకు 100, శ్రీకాకుళం 120, రాజమండ్రి 50,  కాకినాడ 30, అమలాపురం, నరసాపురాలకు మూడేసి చొప్పున, భీమవరానికి నాలుగు, నర్సీపట్నం నుంచి విజయవాడకు 20 బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించారు. వచ్చే నెల రెండో తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు నడుపుతామన్నారు.  

Updated Date - 2020-10-21T17:09:20+05:30 IST