సీఎం రాక.. దర్శనాలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-10-13T06:27:15+05:30 IST

ముఖ్యమంత్రి రాక.. అధికారుల అత్యుత్సాహం కారణంగా మంగళవారం గంటన్నరకుపైగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సీఎం రాక.. దర్శనాలకు బ్రేక్‌
దర్శనాలను నిలిపివేయడంతో క్యూలైన్లలో నిరీక్షిస్తున్న భక్తులు

ఇబ్బందులు పడిన భక్తులు


ఆంధ్రజ్యోతి, విజయవాడ : ముఖ్యమంత్రి రాక.. అధికారుల అత్యుత్సాహం కారణంగా మంగళవారం గంటన్నరకుపైగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలే మూలా నక్షత్రం.. అమ్మ దర్శనానికి సోమవారం రాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. దీనికి తోడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి రావడంతో మధ్యాహ్నం గంటన్నరపాటు దర్శనాలను నిలిపివేశారు. అదే సమయంలో వర్షం పడడంతో భక్తులు తడిసి ముద్దయ్యారు. సీఎం కాన్వాయ్‌ ఘాట్‌ మార్గంలోకి ప్రవేశించిన వెంటనే దర్శనాలకు నిలిపివేశారు. క్యూల్లో భక్తులను ఓం మలుపు నుంచే నియంత్రించారు. సీఎం దాదాపు గంటకు పైగానే ఆలయంలో ఉన్నారు. ముఖ్యమంత్రి వెళ్లిన తరువాత ఒక్కసారిగా క్యూలను వదలటంతో భక్తులు పరుగులు పెట్టారు. దీంతో ఓం మలుపు వద్ద స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది.

Updated Date - 2021-10-13T06:27:15+05:30 IST