వాగు పొరంబోకు ఆక్రమణ

ABN , First Publish Date - 2020-08-04T10:54:49+05:30 IST

వాగు పొరంబోకు భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని యాదమరి మండలం దాసరాపల్లె పంచాయతీలోని ..

వాగు పొరంబోకు ఆక్రమణ

ఆరిమాకులపల్లెవాసుల ఆరోపణ

‘స్పందన’ రద్దన్నా కలెక్టరేట్‌కు తరలివచ్చిన బాధితులు


చిత్తూరు, ఆగస్టు 3: వాగు పొరంబోకు భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని యాదమరి మండలం దాసరాపల్లె పంచాయతీలోని ఆరిమాకులపల్లెవాసులు డిమాండ్‌ చేశారు. సర్వేనెంబరు 356-2లోని 1.54 ఎకరాలను గ్రామానికి చెందిన అధికారపార్టీ నేత ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. ఈ మేరకు విచారించి న్యాయం చేయాలని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన బాక్సులో అర్జీ సమర్పించారు. ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా స్పందన కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో రద్దు చేసినట్లు కలెక్టర్‌ భరత్‌ గుప్తా ప్రకటించినా, బాధితులు తరలివచ్చారు. ఫ ప్రహరీని ఎదురింటివారు కూలగొట్టి.. తమ స్థలాన్ని ఆక్రమించారని చిత్తూరు మండలం మాపాక్షికి చెందిన రీతిక, ఆమె కుటుంబీకులు వాపోయారు.


మరోవైపు ఆక్రమించుకున్న వారికే స్థలాన్ని రాసిచ్చేయాలని వీఆర్వో తమను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఫ  చిత్తూరు -వేలూరు రోడ్డు పక్కనే ఉన్న తమ ఇళ్లను ఖాళీ చేయించి.. గుట్టలో స్థలాలిస్తే అక్కడ ఉండలేమని గుడిపాల మండలం గట్రాలమిట్ట పంచాయతీ నంగమంగళం కొత్తకాలనీవాసులు తేల్చి చెప్పారు. ఫ చందాలేసుకుని చదును చేసుకున్న గుట్ట 71 సెంట్ల స్థలంలోనే తమకు ఇళ్ల పట్టాలివ్వాలని తవణంపల్లె మండలం వడ్డిపల్లెవాసులు కోరారు. 

Updated Date - 2020-08-04T10:54:49+05:30 IST