నటుడు దాసరి అరుణ్‌కుమార్‌పై కేసు

ABN , First Publish Date - 2022-01-21T17:03:27+05:30 IST

మద్యం మత్తులో వాహనం వేగంగా నడుపుతూ పార్కింగ్‌లో ఉన్న ఐదు వాహనాలను ఢీ కొట్టడంతో నటుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు

నటుడు దాసరి అరుణ్‌కుమార్‌పై కేసు

 మద్యం మత్తులో వాహనాల ఢీ  

హైదరాబాద్/బంజారాహిల్స్‌: మద్యం మత్తులో వాహనం వేగంగా నడుపుతూ పార్కింగ్‌లో ఉన్న ఐదు వాహనాలను ఢీ కొట్టడంతో నటుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌కు చెందిన దాసరి అరుణ్‌కుమార్‌ మద్యం మత్తులో  ఈనెల 19న జూబ్లీహిల్స్‌ నుంచి బంజారాహిల్స్‌కు వేగంగా కారు నడుపుతూ వెళ్లి పార్కింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. ఐదు వాహనాలు ధ్వంసం అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని అరుణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-01-21T17:03:27+05:30 IST