Abn logo
Apr 19 2021 @ 19:52PM

‘ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది’

హైదరాబాద్: కరోనా విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. ఈ విషయం హైకోర్టు పేర్కొందని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ అన్నారు. రెమిడెసివర్ ఇంజక్షన్ కోసం ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. మంత్రి ఈటెల రాజేందర్‌కు పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వడం లేదన్నారు. ఈ రోజు కరోనా పేషెంట్‌లకు బెడ్లు దొరకక అల్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ ఇంత సీరియస్‌గా ఉంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.  ప్రభుత్వ ఆస్పత్రులలో ఎంత మంది డాక్టర్లు, నర్సులను రిక్రూట్ చేశావంటే సమాధానం లేదన్నారు. ఎంత సేపు సీఎం కేసీఆర్‌కు ఎన్నికల మీద ధ్యాసే తప్ప.. ప్రజల ఆరోగ్యం మీద లేదని మండిపడ్డారు.  

Advertisement
Advertisement
Advertisement