జీ మెయిల్‌లోనూ డేటా సేకరణ!

ABN , First Publish Date - 2021-02-27T09:28:49+05:30 IST

జీమెయిల్‌ని ఉచితంగా ఉపయోగించుకునే వారి నుంచి ఏయే సమాచారాన్ని సేకరిస్తామన్నది గూగుల్‌ తాజాగా బైటపెట్టింది. యాపిల్‌ ప్రైవేటు పాలసీని రూపొందించి నెలలు గడచిన తరవాత ఇప్పుడు గూగల్‌

జీ మెయిల్‌లోనూ డేటా సేకరణ!

జీమెయిల్‌ని ఉచితంగా ఉపయోగించుకునే వారి నుంచి ఏయే సమాచారాన్ని సేకరిస్తామన్నది గూగుల్‌ తాజాగా బైటపెట్టింది.  యాపిల్‌ ప్రైవేటు పాలసీని రూపొందించి నెలలు గడచిన తరవాత ఇప్పుడు గూగల్‌ తన పాలసీని విడుదల చేసింది. గూగుల్‌ ఫొటోస్‌, డ్రైవ్‌, గూగుల్‌ మ్యాప్స్‌కు సంబంధించిన పాలసీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.  వినియోగదారుడు తన ఐఫోన్‌లో జీమెయిల్‌ అకౌంట్‌ను తెరుచుకుని ఉంటే ఆ వ్యక్తి  సమాచారాన్ని సేకరించగలుగుతుంది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులకూ ఇదే పాలసీ వర్తిస్తుంది.


జీమెయిల్‌ను వ్యక్తిగత వినియోగం అలాగే బిజినెస్‌ అవసరాలు అన్న విషయంలో మళ్ళీ తేడా ఉంది. పాలసీలోనూ  ఆ తేడా ఉంది. మూడో పార్టీ అడ్వర్టయిజింగ్‌ కోసం సంక్షిప్తీకరించిన లొకేషన్‌ డేటా, డివైస్‌ గుర్తింపునకు యూజర్‌ ఐడి తీసుకుంటుంది. ప్రొడక్ట్‌ పర్సనలైజేషన్‌, యాప్‌ ఫంక్షనాలిటీకోసం ఈ డేటాను సేకరిస్తుంది. పేరు, లొకేషన్‌(అంతగా యాక్యురేట్‌ కాదు), ఈమెయిల్‌ చిరునామా, ఈమెయిల్స్‌/టెక్స్ట్‌ మెసేజ్‌లు, ఫొటోలు/ వీడియోలు, ఆడియో డేటా, ఇతర యూజర్‌ డేటా, అడ్వర్టయిజింగ్‌ డేటా, క్రాష్‌ డేటా, పర్ఫార్మన్స్‌  డేటా, ఇతర డేటాను తీసుకుంటుంది. 


ఐఔస్‌ యాప్‌ ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తోందో తెలుసుకునేందుకు యాపిల్‌ చాలా సాధారణ విధానాన్ని ప్రవేశపెట్టింది. యాపిల్‌ స్టోర్‌లోకి వెళ్ళి సదరు యాప్‌ను సెర్చ్‌ చేయాలి. స్ర్కోల్‌ డౌన్‌ చేస్తే చాలు ఏ సమాచారాన్ని సంగ్రహించారో తెలుస్తుంది. ఐఫోన్‌ లేనిపక్షంలో యాప్‌ స్టోర్‌ వెబ్‌సైట్‌ని ఏదైనా పీసీపై ఓపెన్‌ చేయాలి. అక్కడి నుంచి వివరాలు తెలుసుకోవచ్చు.

Updated Date - 2021-02-27T09:28:49+05:30 IST