బ్యాంకు కస్టమర్ల డేటా చోరీ

ABN , First Publish Date - 2021-03-25T14:00:54+05:30 IST

గతంలో పనిచేసిన బ్యాంక్‌లో కస్టమర్‌ల డేటాను చోరీ చేసి, లోన్‌లు ఇప్పిస్తామంటూ

బ్యాంకు కస్టమర్ల డేటా చోరీ

  • లోన్లు ఇప్పిస్తామంటూ ఫోన్‌
  • నిందితుడి అరెస్టు 

హైదరాబాద్‌ : గతంలో పనిచేసిన బ్యాంక్‌లో కస్టమర్‌ల డేటాను చోరీ చేసి, లోన్‌లు ఇప్పిస్తామంటూ ఫోన్‌లు చేసి, ఆన్‌లైన్‌ రుణాలకు అప్లై చేసి కమీషన్‌ తీసుకుంటున్న నిందితుడిని రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ జిల్లా, రాయపర్తికి చెందిన కొత్తపల్లి అశోక్‌ శ్రీనగర్‌ కాలనీ, మన్సూరాబాద్‌లో నివసిస్తున్నాడు. గడ్డి అన్నారం హెచ్‌డీఎ‌ఫ్‌సీ బ్యాంక్‌లో 2007 నుంచి 2018 వరకు పర్సనల్‌ లోన్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. 2017లో బ్యాంక్‌ కస్టమర్‌ల డేటాను ఫోన్‌నంబర్‌లతో సహా చోరీ చేశాడు. ఎల్‌బీనగర్‌లో తరంగిణి పేరుతో ఆఫీస్‌ ప్రాంభించాడు. నలుగురు టెలీకాలర్స్‌ను నియమించుకొని బ్యాంక్‌ కస్టమర్లకు ఫోన్‌ చేయించేవాడు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నామని పర్సనల్‌ లోన్స్‌ ఇప్పిస్తామని నమ్మించేవాడు. రుణం అవసరమున్న వారి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో అప్లై చేసి కమీషన్‌ తీసుకునేవాడు. ఈ విషయాన్ని కొంతమంది కస్టమర్లు బ్యాంక్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంక్‌ జోనల్‌ మేనేజర్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి నిందితుడు అశోక్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-03-25T14:00:54+05:30 IST