గ్రామాల్లో జోరుగా డేటా వినియోగం

ABN , First Publish Date - 2020-04-06T06:14:24+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అంద రూ ఇళ్లకే పరిమితమయ్యారు. చేసేందుకు పనేమీ ఉండదు. ఏం చేయాలి? అందరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్లు...

గ్రామాల్లో జోరుగా డేటా వినియోగం

  • నెల రోజుల్లో 100 శాతం పెరుగుదల : సీఎస్‌సీ 


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అంద రూ ఇళ్లకే పరిమితమయ్యారు. చేసేందుకు పనేమీ ఉండదు. ఏం చేయాలి? అందరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, టిక్‌టాక్‌.. ఇలా ఎన్నింటినో చూస్తూ రోజులు గడుపుతున్నారు చాలా మంది. అందుకే డేటా వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డేటా వినియోగం నెల రోజుల్లోనే సీఎ స్‌సీ ఎస్‌పీవీ నెట్‌వర్క్‌పై డేటా వినియోగం దాదాపు 100 శాతం పెరిగిందని ఆ సంస్థ సీఈఓ దినేష్‌ త్యాగి తెలిపారు.


సీఎ్‌ససీ ఈ-గవర్నెన్స్‌ సర్వీసెస్‌ ఇండియా.. ఇంటర్నెట్‌ సర్వీసులు అందిస్తోంది. మార్చి 10న డేటా వినియోగం 2.7 టెరా బైట్‌ (టీబీ) ఉండగా.. మార్చి 30న 4.7 టీబీకి పెరిగింది. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి డేటా వినియోగం పెరగడం మొదలైందని త్యాగి చెప్పారు. ఫైబర్‌ టు ది హోమ్‌ (ఎఫ్‌టీటీహెచ్‌)కు కూడా అధిక డిమాండ్‌ ఉందని ఆయన తెలిపారు. మార్చిలో 50,000 గ్రామ పంచాయితీల్లో ఎఫ్‌టీటీహెచ్‌ కోసం 3 లక్షలకు పైగా వినియోగదారులు రిజిస్టర్‌ చేసుకున్నారని చెప్పారు. 

Updated Date - 2020-04-06T06:14:24+05:30 IST