ఫేస్‌బుక్‌ నుంచి డేటింగ్‌ యాప్‌!

ABN , First Publish Date - 2021-04-17T06:08:51+05:30 IST

‘స్పార్డ్క్‌’ పేరిట ఫేస్‌బుక్‌ ఓ డేటింగ్‌ యాప్‌ను రూపొందిస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉంది. వీడియో స్పీడ్‌ డేటింగ్‌ యాప్‌నకు ఇది భిన్నం. ఫేస్‌బుక్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ బృందం స్పార్డ్క్‌ను రూపొందించింది. అయితే ప్రస్తుతం ఇది మన దేశంలో అందుబాటులో లేదు

ఫేస్‌బుక్‌ నుంచి డేటింగ్‌ యాప్‌!

‘స్పార్డ్క్‌’ పేరిట ఫేస్‌బుక్‌ ఓ డేటింగ్‌ యాప్‌ను రూపొందిస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉంది. వీడియో స్పీడ్‌ డేటింగ్‌ యాప్‌నకు ఇది భిన్నం. ఫేస్‌బుక్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ బృందం స్పార్డ్క్‌ను రూపొందించింది. అయితే ప్రస్తుతం ఇది మన దేశంలో అందుబాటులో లేదు. ‘ద వెర్జ్‌’ కథనం ప్రకారం పబ్లిక్‌ ప్రొఫైల్స్‌, స్వైపింగ్‌, డిఎంలను సైతం ఆఫర్‌ చేయటం లేదు. వీడియో చాటింగ్‌ వేదికగానే ఉంటుంది. నాలుగు నిమిషాల వ్యవధి కలిగి ఉంటుంది. ఇరువురికి అంగీకారం అయితే ఆ సమయాన్ని గరిష్ఠంగా పది నిమిషాలకు పెంచుకోవచ్చు. పురోగతిని బట్టి మున్ముందు వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌, ఐమెసేజ్‌ లేదా ఈమెయిల్‌తో ఒకరికొకరు కాంటాక్ట్‌ కావచ్చు.


ఈ యాప్‌ థీమ్‌ కైండ్‌నెస్‌(దయ, కరుణ, జాలి చూపగలగడం).  అలాంటి వ్యక్తుల కోసం ఈ యాప్‌ను ఉద్దేశించినట్టు వెబ్‌ పేజీలో వివరించింది.  దీనికి సైన్‌ చేసిన వినియోగదారులు సైతం ‘కైండ్‌ డేటర్‌’ కావడానికి గల కారణాలను తెలియజేయాలి. తద్వారా మాత్రమే ఈ యాప్‌ను ఉపయోగించడానికి సదరు వినియోగదారుడు అర్హుడా కాదా అని ఫేస్‌బుక్‌ తేలుస్తుంది.  అలాగే యూజర్‌ ప్రైవేటు ప్రొఫైల్‌ను అనుసరించి ఫేస్‌బుక్‌ వారికి తగ్గ జనాలను రికమెండ్‌ చేస్తుంది. వెబ్‌సైట్‌ ద్వారానే ఇది అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌పెరిమెంట్‌ ప్రాజెక్టు కావడంతో ఇది ఐఔస్‌ లేదా ఆండ్రాయిడ్‌లో ఉండదు. 

Updated Date - 2021-04-17T06:08:51+05:30 IST