కుమార్తెకు తనవల్లే కరోనా వచ్చిందన్న ఆవేదనతో ఆ తండ్రి ఎంత ఘోరానికి పాల్పడ్డాడంటే..!

ABN , First Publish Date - 2020-07-25T18:32:27+05:30 IST

కష్టపడి పనిచేసి పిల్లల జీవితాలను చక్కదిద్దాడా ఆ తండ్రి.. కుమార్తె రెండు నెలల గర్భిణి కావడంతో కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే పనికి వెళ్లి వచ్చేవాడు. అయినా కరోనా వీరి కుటుంబంలో

కుమార్తెకు తనవల్లే కరోనా వచ్చిందన్న ఆవేదనతో ఆ తండ్రి ఎంత ఘోరానికి పాల్పడ్డాడంటే..!

రాజమహేంద్రవరం సిటీ (ఆంధ్రజ్యోతి): కష్టపడి పనిచేసి పిల్లల జీవితాలను చక్కదిద్దాడా ఆ తండ్రి.. కుమార్తె రెండు నెలల గర్భిణి కావడంతో కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే పనికి వెళ్లి వచ్చేవాడు. అయినా కరోనా వీరి కుటుంబంలో ప్రవేశించి చిన్నాభిన్నం చేసింది. రాజమహేంద్రవరం మోరంపూడి చైతన్య నగర్ కు చెందిన 57 ఏళ్ల ఓ జట్టు కూలీ రంభ ఊర్వసి సెంటర్ ఉల్లిపాయల మార్కెట్ లో పనిచేస్తున్నాడు. చాలా కాలం కిందట శ్రీకాకుళం జిల్లా నుంచి రాజమహేంద్రవరం వచ్చిన ఆయన ఇక్కడ స్థిరపడి ఇల్లు కట్టుకుని పిల్లల్ని చదివించుకుని ఒక స్థాయికి తీసుకు వచ్చాడు. అయినా జట్టు పని మానకుండా వెళ్లి వస్తున్నాడు. అతడికి భార్య, కొడుకు,కూతురు ఉన్నారు. కుమార్తె అంటే అతడికి చాలా ఇష్టం. ఆమె రెండు నెలల గర్భిణీ. ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో మనస్తాపంతో ఉన్నాడు. అతడికీ కరోనా లక్షణాలు ఉండటంతో మరింత కుంగిన ఆతడు.. తన వల్లె కుమార్తెకూ కరోనా వచ్చిందని ఆవేదన చెందాడు. గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో రైలు పెట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఆధార్ కార్డు ఆధారంగా అతడిని గుర్తించారు. మృతదేహానికి శనివారం కరోనా పరీక్ష చేస్తారు. 

Updated Date - 2020-07-25T18:32:27+05:30 IST