ఇంట్లో డబ్బు, బంగారం మాయం.. పోలీసుల ఎంట్రీ.. 17 ఏళ్ల కుమార్తె ఫోన్‌కాల్ డేటా చూసి నివ్వెరపోయిన కుటుంబ సభ్యులు.. చివరకు..

ABN , First Publish Date - 2021-11-09T21:10:25+05:30 IST

ఇంట్లో దాచుకున్న బంగారం, డబ్బు మాయమైందని ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది..

ఇంట్లో డబ్బు, బంగారం మాయం.. పోలీసుల ఎంట్రీ.. 17 ఏళ్ల కుమార్తె ఫోన్‌కాల్ డేటా చూసి నివ్వెరపోయిన కుటుంబ సభ్యులు.. చివరకు..

ఇంట్లో దాచుకున్న బంగారం, డబ్బు మాయమైందని ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులనందరినీ విచారించారు.. ఆ ఇంట్లో ఉన్న 17 ఏళ్ల బాలిక కాల్ డేటా చెక్ చేశారు.. ఆమె గంటలు గంటలు ఓ యువకుడితో మాట్లాడుతున్నట్టు గమనించారు.. అనుమానం వచ్చి విచారిస్తే అసలు విషయం బయటపడింది.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లిపోయేందుకు ఆ బాలిక వేసిన ప్లాన్ ఇదని తెలిసి పోలీసులు కూడా నివ్వెరపోయారు. 


రాజస్థాన్‌లోని పాలి ప్రాంతానికి చెందిన రాజన్ దుష్యంత్ గత నెల 11న పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన ఇంట్లో గొయ్యి తీసి అందులో దాచిన 9 తులాల బంగారం, రూ.4 లక్షల నగదు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గొయ్యి తీసి దాచిన డబ్బు పోయిందని చెప్పడంతో దానిలో ఇంట్లో వారి హస్తం ఉండే ఉంటుందని పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న 17 ఏళ్ల బాలిక కాల్ డేటా చెక్ చేశారు. ఆమె గంటలు గంటలు ఓ యువకుడితో మాట్లాడుతున్నట్టు గమనించారు. అనుమానం వచ్చి ఆమెను, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను విచారించారు. 


విచారణలో వారిద్దరూ నిజాన్ని అంగీకరించారు. తామిద్దరం మైనర్లమని, మైనారిటీ తీరిపోయాక ఊరి నుంచి పారిపోదామనుకున్నామని, అందుకోసం డబ్బు, నగలు దొంగిలించామని అంగీకరించారు. దీంతో అందరూ షాకయ్యారు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆ డబ్బు, నగలను ఆ బాలిక పెళ్లి కోసమే దాచి ఉంచామని కుటుంబ సభ్యులు చెప్పడం విశేషం. 

Updated Date - 2021-11-09T21:10:25+05:30 IST