Advertisement
Advertisement
Abn logo
Advertisement

అత్త, కోడలి మధ్య భేదాభిప్రాయాలు.. అత్తపై కోడలు ఎలా పగ తీర్చుకుందంటే..

వారిద్దరూ అత్తాకోడళ్లు.. వివాహం జరిగిన మరుసటి నెల నుంచి ఇద్దరికీ పడేది కాదు.. ఒకరి పైన మరొకరికి తీవ్రమైన ద్వేషం ఏర్పడింది.. ఇంట్లో రోజూ రణరంగమే.. దీంతో అత్తను చంపేందుకు కోడలు ప్రయత్నించింది.. ఆమె తాగే టీలో విషం కలిపేసింది.. తీవ్ర అస్వస్థతకు గురైన అత్త ప్రాణాలను దక్కించుకుంది.. కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్యానాలోని లాల్‌పురా‌లో ఈ ఘటన జరిగింది. 


లాల్‌పురాకు చెందిన ద్రాపతి అనే మహిళ తన కొడుకు, కోడలితో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. కోడలు పూనమ్‌తో ఆమెకు ఎప్పట్నుంచో అభిప్రాయ భేదాలున్నాయి. శనివారం మధ్యాహ్నం ఆమె తన కోసం టీ చేసుకుంది. టేబుల్‌ పైన టీ పెట్టుకుని గేట్ వేసేందుకు బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేటప్పటికీ పూనమ్ అత్త టీ పెట్టుకున్న టేబుల్ దగ్గర కూర్చుంది. ఆ టీ తాగిన కొద్దిసేపటికే ద్రాపతి తీవ్ర అస్వస్థతకు గురైంది.


చుట్టుపక్కల వాళ్లు ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కోలుకున్న ద్రాపతి తన కోడలు పూనమ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను గేట్ వేసి తిరిగి వచ్చే సమయానికి కోడలు తన టీలో ఏదో కలిపిందని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కోడల్ పూనమ్‌ను ప్రశ్నిస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement