టిక్-టాక్‌లో డ్యూయెట్ చేద్దాం.. విరాట్‌ను అహ్వానించిన వార్నర్

ABN , First Publish Date - 2020-05-23T17:46:02+05:30 IST

తన టిక్‌-టాక్‌ వీడియోలతో ఈ లాక్‌డౌన్ సమయంలో అభిమానులకు వినోదాన్ని పంచుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని

టిక్-టాక్‌లో డ్యూయెట్ చేద్దాం.. విరాట్‌ను అహ్వానించిన వార్నర్

సిడ్నీ: తన టిక్‌-టాక్‌ వీడియోలతో ఈ లాక్‌డౌన్ సమయంలో అభిమానులకు వినోదాన్ని పంచుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తనతో కలిసి ఓ టిక్-టాక్ వీడియో చేయాలని ఆహ్వానించాడు. శుక్రవారం అక్షయ్ కుమార్ తాజాగా చిత్రం ‘హౌస్‌ఫుల్-4’లోని ‘బాలా’ అనే పాటకి చిందులు వేస్తూ.. వార్నర్ టిక్-టాక్ వీడియో చేశాడు. ఈ వీడియోపై విరాట్ స్పందించాడు. నవ్వుతున్నట్లుగా ఉండే ఎమోజీలను విరాట్ కామెంట్ చేశాడు. 


అయితే దీనిపై వార్నర్ కూడా స్పందించాడు. ‘‘ఇక తర్వాత నువ్వే సోదరా.. కలిసి ఓ డ్యూయెట్ చేద్దాం. నీ భార్య కావాలంటే.. నీకు అకౌంట్ చేసి ఇస్తుందిలే’’ అని వార్నర్ కామెంట్ చేశాడు. 



Updated Date - 2020-05-23T17:46:02+05:30 IST