పగలు ఎండ... రాత్రి చలి

ABN , First Publish Date - 2021-03-08T09:55:05+05:30 IST

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. ఆకాశం నిర్మలంగా ఉండడంతో పగటి పూట ఎండ తీవ్రత పెరిగింది.

పగలు ఎండ... రాత్రి చలి

విశాఖపట్నం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. ఆకాశం నిర్మలంగా ఉండడంతో పగటి పూట ఎండ తీవ్రత పెరిగింది. దీంతో పలుచోట్ల మధ్యాహ్న సమయంలో వేడి వాతావరణం నెలకొంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగత్ర నమోదైంది. కాగా రాయలసీమతోపాటు శివారు ప్రాంతాల్లో రాత్రి పూట చలి కొనసాగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో పొడివాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 

Updated Date - 2021-03-08T09:55:05+05:30 IST