Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం

కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 3: విభిన్న ప్రతిభావంతులకు చేయూతనివ్వాలని విద్యాధికారి పి. మౌలాలి అన్నారు. శుక్రవారం నగరంలోని బుధవారపేట భవిత కేంద్రంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపలహైస్కూల్‌ హెచ్‌ఎం కాంతమ్మ హాజరయ్యారు. కార్యక్రమంలో కేడీఎస్‌ఎస్‌ వెంకాయపల్లె డిసేబుల్‌ ఆర్గనైజేషన్‌ ఫాదర్‌ భాస్కర్‌, ఉపాధ్యాయులు బాబి లత, ఎస్‌ఎస్‌ సలీం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.


డోన్‌(రూరల్‌): పట్టణంలోని భవిత కేంద్రంలో శుక్రవారం సర్వశిక్ష ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ర్యాలీ నిర్వహించారు. వ్యాసరచన, వకృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన దివ్యాంగులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కొత్తపేట పాఠశాల ఐఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం ఈరన్న నాయక్‌, ఐఈఆర్‌టీలు మధుబాబు, రాణి, డీపీపీలు, సీఆర్పీలు పాల్గొన్నారు.


బేతంచెర్ల: మండలంలోని అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భవిత కేంద్రంలో ఐఈఆర్‌పీ ఉపాధ్యాయులు జి.నాగరాజు, జి.వేణుగోపాల్‌, అలాగే హనుమాన్‌ నగర్‌లోని జడ్పీహెచ్‌ పాఠశాల  ప్రధానోపాధ్యాయులు నూర్‌ అహ్మద్‌, బేతంచెర్ల జడ్పీ పాఠశాలలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసి స్వీట్లును పంపిణీ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


సి.బెళగల్‌: దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల భవిత కేంద్రంలో శుక్రవారం దివ్యాంగులను ఎంఈవో జ్యోతి సన్మాంచారు. ఎంఈవో మట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐఆర్‌టీ ఉపాధ్యాయులు మద్దిలేటి, కోటస్కూల్‌ హెచ్‌ఎం కిశోర్‌కుమార్‌, ఫిజియోథెరపిస్టు డాక్టర్‌ వీరేష్‌ తదితరులు ఉన్నారు. 


తుగ్గలి: విభిన్నప్రతిభావంతులను ప్రోత్సహించి వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తుగ్గలి ఎస్‌ఐ సమీర్‌బాషా అన్నారు. తుగ్గలి జిల్లాపరిషత్‌ హైస్కూల్‌లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగులకు పోటీలు నిర్వహించి అందరికి బహుమతులను అందించి మిఠాయిలు పంపిణీ చేశారు. 


క్రిష్ణగిరి: క్రిష్ణగిరిలో సెక్రెడ్‌ ఆధ్వర్యంలో విబిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వంహించారు. బహిరంగ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీడీవో అన్వరాబేగం హాజరయ్యారు. విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేసారు. కార్యక్రమంలో ఎస్‌ఐ అశోక్‌, సెక్రేడ్‌ సభ్యులు లక్ష్మీప్రసన్న, శివశంకర్‌, వీరేశమ్మ, ప్రగతి, మార్గదర్శి, మండల సమాఖ్య అధ్యక్షుడు రాజేంద్ర, రామగిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.Advertisement
Advertisement