Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండిళ్లలో పట్టపగలు చోరీ

15 తులాల బంగారం, నగదు అపహరణ

చౌటుప్పల్‌రూరల్‌, నవంబరు 24: జిల్లాలోని చౌటుప్పల్‌తో పాటు మోత్కూరు మండలం సదర్శాపురం గ్రామంలో రెండిళ్లలో పట్టపగ లు గుర్తు తెలియ ని దుండగులు చో రీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వలిగొండలో ఆరోగ్యవిస్తరాణాఽధికారిగా విధులు నిర్వహిస్తున్న బడుగు శ్రీరాములు చౌటుప్పల్‌ పట్టణ కేం ద్రంలోని మార్కండేయనగర్‌లో నివాసం ఉంటున్నాడు. బుధవారం శ్రీరాములు విధులకు వెళ్లగా భార్య, కుమారుడు ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో దొంగలు ఇంటి తాళాలు విరగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తాళాలు విరగొట్టారు. బీరువాలో ఉన్న ప దిహేను తులాల బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు అపహరించా రు. ఆరు గంటలకు కుటుంబసభ్యులు ఇంటికి వచ్చే సరికి చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సం ఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మోత్కూరు మండలం సదర్శాపురం గ్రా మంలో మంగళవారం పట్టపగలు తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుని కథనం ప్రకారం... గ్రామానికి చెం దిన రైతు చింత మల్లయ్య కుటుంబ సభ్యులు మంగళవారం ఇంటికి తా ళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని వచ్చే సరికి ఇంటి తాళం విరగ్గొట్టి ఉంది. లోపలకు వెళ్లిచూసే సరికి బీరువా తె రిచి అందులో దాచిన రూ.85 వేలు ఎత్తుకెళ్లారని గుర్తించారు. బుధవా రం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు మల్లయ్య తెలిపారు.


Advertisement
Advertisement