Advertisement
Advertisement
Abn logo
Advertisement

డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు

పరిగి: మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం పార్టీ కార్యకర్తల సమక్షంలో జరుపుకున్నారు. టీఆర్‌ఆర్‌ నివాసంలో కేక్‌ కట్‌చేయగా, కార్యకర్తలు, అభిమానులు స్వీట్లు తినిపించి శు భాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డిమాట్లాడుతూ.. కార్యకర్తలు, అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు. తన జీవితాన్ని పరిగి ప్రజలకు అంకితం చేస్తానన్నారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శులు కె.హన్మంత్‌ముదిరాజ్‌, ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌, కొమిరె రాంచంద్రయ్య, కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు సుభా్‌షచందర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పరశురాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇ.కృష్ణ, ఆంజనేయులు, నర్సింహులు, అక్బర్‌, రియాజ్‌, శివకుమార్‌, శ్రీనివాస్‌, జగన్మోహన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement