డీసీసీబీని లాభాల బాటలో నడుపుతాం

ABN , First Publish Date - 2021-07-25T04:37:08+05:30 IST

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ను లాభాల బాటలో నడుపుతామని చైౖర్మగా బాధ్యతలు స్వీకరించిన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి చెప్పారు.

డీసీసీబీని లాభాల బాటలో నడుపుతాం
మాట్లాడుతున్న సత్యనారాయణరెడ్డి

 కామిరెడ్డి


నెల్లూరు(హరనాథపురం), జూలై 24 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ను లాభాల బాటలో నడుపుతామని  చైౖర్మగా బాధ్యతలు స్వీకరించిన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి చెప్పారు. శనివారం డీసీసీబీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఆ బ్యాంకులో ఘనంగా జరిగింది. బాధ్యతలు స్వీకరించిన కామిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం డీసీసీబీ రూ. 1188 కోట్ల వ్యాపారం చేస్తున్నదన్నారు. రుణాల రికవరీ రేటు 80శాతానికి పైబడి ఉందన్నారు.  రూ. 6 కోట్లకు పైబడి లాభాల్లో ఉందన్నారు. డీసీసీబీ వ్యాపారాన్ని విస్తృత పరుస్తామన్నారు. రైతులకు ఇతోధికంగా రుణాలను అందచే స్తామన్నారు. బ్యాంకు ఉద్యోగులకు పర్సనల్‌, హౌసింగ్‌ రుణాలను ఎక్కువగా అందచేస్తామన్నారు. ఇప్పటికే పొదుపు సంఘాలకు, వీధి విక్రయదారులకు రుణాలను అందచేశా మని వివరించారు.  వీరికి ఇంకా ఎక్కువగా రుణాలు అందచే స్తామని చెప్పారు.  బ్యాంకు అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌, డీసీసీబీ సీఈవో శంకర్‌బాబు, జీఎం సరిత, డీజీఎంలు ఉషారాణి, నాగరాజకుమారి, దయాకర్‌రెడ్డిలతోపాటు నూతన పాలకమండలి సభ్యులు వెలికంటి రమణారెడ్డి,  చేజర్ల చలమారెడ్డి,  నరమాకల వెంకటరమణయ్య,  చింతం తిరుమలరాణి, డక్కిలి రమణయ్య, కంతర్‌ ఆలీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T04:37:08+05:30 IST