Abn logo
Dec 1 2020 @ 00:40AM

పంటలకు రుణ పరపతి

బ్యాంకర్లు, అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న జేసీ వేణుగోపాలరెడ్డి

జేసీ వేణుగోపాలరెడ్డి

విశాఖపట్నం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్ని పంటలకు నిర్ణయించిన మేరకు రుణ పరపతి అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌, రబీ పంటలకు జిల్లాలో రుణ పరపతి నిర్ణయించామన్నారు. గత ఏడాది వరికి ఎకరాకు రూ.34వేలు రుణ పరపతి కాగా ఈ సంవత్సరం దానిని రూ.38 వేలకు పెంచామన్నారు. చెరకు విషయానికొస్తే రూ.62 వేల నుంచి రూ.65 వేలుకు పెంచామన్నారు. జిల్లా స్థాయిలో నిర్ణయించిన పరపతి మేరకు రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీఎ పీడీ విశ్వేశ్వరరావు, లీడ్‌   జిల్లా మేనేజర్‌ శ్రీనాథ్‌ప్రసాద్‌, డీసీసీబీ సీఈవో డీవీఎస్‌ వర్మ, నాబార్డు డీడీఎం శ్రీనివాసరావు, వ్యవసాయ, మత్స్య, పశు సంవర్ధక శాఖల జేడీలు లీలావతి, ఫణిప్రసాద్‌, రామకృష్ణ, ఉద్యానవన శాఖ ఏడీ శైలజ, పలువురు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement