అవకతవలపై విచారణకు ప్రత్యేక కమిటీ

ABN , First Publish Date - 2020-12-04T06:07:16+05:30 IST

డీసీసీబీలో అవకతవకలు, నాబార్డు రుణాలు, ఉద్యోగోన్నతులు, వాహనాలు, పరిహారం, ఆడిట్‌ తదితర అంశాలపై విచారణకు పాలకవర్గ సభ్యులు, అధికారులతో ప్రత్యేక కమిటీని వేస్తున్నట్లు చైర్మన్‌ లాలుపురం రాము తెలిపారు.

అవకతవలపై విచారణకు ప్రత్యేక కమిటీ
సమావేశంలో ప్రసంగిస్తున్న చైర్మన్‌ లాలుపురం రాము

డీసీసీబీ చైర్మన్‌ లాలుపురం రాము

 ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌...

గుంటూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): డీసీసీబీలో అవకతవకలు, నాబార్డు రుణాలు, ఉద్యోగోన్నతులు, వాహనాలు, పరిహారం, ఆడిట్‌ తదితర అంశాలపై విచారణకు పాలకవర్గ సభ్యులు, అధికారులతో ప్రత్యేక కమిటీని వేస్తున్నట్లు చైర్మన్‌ లాలుపురం రాము తెలిపారు. గుంటూరులోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్‌ సహకార భవన్‌లో గురువారం జరిగిన పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గురువారం ఆంధ్రజ్యోతి సంచికలో ‘తాకట్టు రుణాలపై ఫిర్యాదులు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై సమావేశంలో చర్చించారు. చైర్మన్‌ మాట్లాడుతూ నాబార్డు తాకట్టు రుణాల రికవరీపై ప్రత్యేక కమిటీ ద్వారా సమీక్షిస్తామన్నారు. బ్యాంక్‌లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన వ్యవహారాలపై చర్యలు తీసుకుంటామన్నారు. రికవరీలు పెంచి కొత్తగా రుణాలు ఇవ్వాలన్నారు. మహిళా గ్రూపులను ప్రోత్సహిస్తామని తెలిపారు. రోజువారీ కూలీల వేతనాలు పెంచుతున్నట్లు చెప్పారు. సమావేశంలో పాలకవర్గ సభ్యులు పెదకూరపాడు బుజ్జి, నల్లపాటి రామయ్య, ఆంజనేయులు, కృష్ణమూర్తి, ఏడుకొండలు, సీఈవో కృష్ణవేణి తదితరులు ప్రసంగించారు.


Updated Date - 2020-12-04T06:07:16+05:30 IST