రూ.2,200కోట్ల టర్నోవర్‌తో రెండోస్థానంలో డీసీసీబీ

ABN , First Publish Date - 2020-08-12T10:27:41+05:30 IST

రూ.2,200కోట్ల టర్నోవర్‌తో ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని డీసీసీబీ చైర్మన్‌ కూ

రూ.2,200కోట్ల టర్నోవర్‌తో రెండోస్థానంలో డీసీసీబీ

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ నాగభూషణం


బోనకల్‌, ఆగస్టు 11: రూ.2,200కోట్ల టర్నోవర్‌తో ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) రాష్ట్రంలో రెండో స్థానంలో  ఉందని డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం తెలిపారు. మంగళవారం బోనకల్‌ సొసైటీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 99సొసైటీల్లో రూ.55కోట్ల కొత్త రుణాలను రైతులకు అందజేశామన్నారు. సొసైటీల ద్వారా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, బావులు, పైపులైన్లు, డెయిరీఫాంలకు సులభ వాయిదా పద్ధతిలో 9.5శాతం వడ్డీతో రుణాలను మంజూరు చేస్తున్నట్టు వివరించారు. జిల్లాలో రూ.25వేల లోపు రుణమాఫీ రూ.23కోట్లు జమయ్యాయని తెలిపారు. 14 సొసైటీలకు సంబంధించి గోడౌన్‌ల నిర్మాణాలకు ప్రతిపాదనలు వచ్చాయని, నాబార్డు నుంచి 20శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు.


అన్ని సొసైటీల్లో అర్హులైన రైతులందరికి కొత్త రుణాలు అందించామని, రుణాల రికవరిలో కూడా పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. అంకితబావంతో పని చేసి డీసీసీబీని ప్రగతి పథంలో నడిపిస్తామని, బోనకల్‌ సొసైటీ నిర్వహణలో చైర్మన్‌ చావా వెంకటేశ్వరావు కృషి అభినందనీయమన్నారు. సొసైటీల బలోపేతానికి రైతులు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-08-12T10:27:41+05:30 IST