Abn logo
Sep 25 2021 @ 23:28PM

సీఎంను కలిసిన డీసీఎంఎస్‌ చైర్మన్‌

ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసిన కరీంనగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి

ధర్మపురి, సెప్టెంబరు 25: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.  ఢిల్లీలో జరిగే జాతీయ సహకార సమ్మేళనంలో పాల్గొనేందుకు టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, కరీంనగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్‌ నివాసంలో కలిసి సహకార సంఘాల సమస్యలు గు రించి వివరించారు. సీఎం వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వారి వెంట సొసైటీ చైర్మన్లు స్వామిరెడ్డి, మల్లారెడ్డి,  రాధాకిషన్‌, మల్లారెడ్డి పాల్గొన్నారు.