మృతదేహాన్ని వదిలి వెళ్లిన బంధువులు.. వర్షంలో స్ర్టెచర్‌పై రెండుగంటలపాటు..

ABN , First Publish Date - 2020-07-21T17:31:23+05:30 IST

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీ బయట ఓ వృద్ధురాలి మృతదేహం రెండు గంటల పాటు తడిసి ముద్దయింది. ఆస్పత్రి సిబ్బంది,

మృతదేహాన్ని వదిలి వెళ్లిన బంధువులు.. వర్షంలో స్ర్టెచర్‌పై రెండుగంటలపాటు..

ఎంజీఎంలో మృతదేహాన్ని వదిలి వెళ్లిన బంధువులు.. 

వాహనం దొరక్క ఆలస్యం.. 

వాట్సప్‌లో వైరల్‌ అయిన దృశ్యం..


హన్మకొండ(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీ బయట ఓ వృద్ధురాలి మృతదేహం రెండు గంటల పాటు తడిసి ముద్దయింది. ఆస్పత్రి సిబ్బంది, కుటుంబసభ్యులూ పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. హన్మకొండ సుధానగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు (68) సోమవారం సాయంత్రం హఠాత్తుగా తీవ్రమైన అస్వస్థతకు గురైంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్న క్రమంలో ఆమె మృతి చెందింది. ఆస్పత్రి సిబ్బంది వెంటనే మృతదేహాన్ని స్ర్టెచర్‌పై ఆస్పత్రి క్యాజువాలిటీ బయటకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 


కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకుళ్లేందుకు  అంబులెన్స్‌ కోసం వెళ్లగా మృతదేహం వద్ద ఎవరూ లేకుండా పోయారు. అంబులెన్సు తీసుకురావడంలో జాప్యం జరగడం, ఇంతలో జోరుగా వర్షం కురవడంతో వృద్ధురాలి మృతదేహం రెండు గంటల పాటు తడిసి ముద్దయింది. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్ళారు. వృద్ధురాలి మృతదేహం వర్షంలో తడుస్తుండగా  ఒకరు ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టడంతో అది వైరల్‌ అయింది. 


Updated Date - 2020-07-21T17:31:23+05:30 IST