Advertisement
Advertisement
Abn logo
Advertisement

35ఏళ్ల మహిళ.. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 25ఏళ్ల వ్యక్తితో ప్రేమాయం.. తాజాగా వారిద్దరినీ కుటుంబ సభ్యులు అలా చూసి షాక్!

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు 35ఏళ్ల వయసు ఉంటుంది. కొన్నేళ్ల క్రితమే ఆమెకు పెళ్లి జరిగింది. ఈ క్రమంలోనే ఆ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం తన గ్రామానికే చెందిన 25ఏళ్ల యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ఇద్దరూ దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని ఊహించని విధంగా చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ప్రాంతానికి చెందిన సరోజినీ దేవీ(35) అనే మహిళకు కొన్నేళ్ల క్రితం భగవాన్ దీన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే ఈ దంపతులు ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ.. సరోజినీ దేవీకి క్రమంగా తన భర్తపై ప్రేమ తగ్గడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు రోషన్‌లాల్ అనే 25ఏళల్ కుర్రాడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ కొన్ని రోజులపాటు ప్రేమలో మునిగి తేలారు. తాజాగా వారిద్దరూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్లాన్‌ ప్రకారం లేచి పోయారు.


అలా వెళ్లిన వారిద్దరూ.. అనూహ్యంగా మరుసటి రోజు ఉదయం ఊరి బయట విగత జీవులుగా కనిపించారు. చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా వారిద్దరినీ చూసిన దృశ్యాలను చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. పోస్ట్‌మార్టం నివేదికలో వారిద్దరిదీ ఆత్మహత్య అని తేలిందని పోలీసులు వెల్లడించారు. వారి ప్రేమను సమాజం అంగీకరించదనే ఉద్దేశంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement