యూజీ, పీజీ అడ్మిషన్లకు గడువు 31

ABN , First Publish Date - 2020-10-25T07:36:03+05:30 IST

కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో 2020-21 డిగ్రీ, పీజీ మొదటి ఏడాదిలో అడ్మిషన్‌ పొం దేందుకు ఈ నెల 31 వరకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

యూజీ, పీజీ అడ్మిషన్లకు గడువు 31

కేయూ క్యాంపస్‌, అక్టోబరు 24 : కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో 2020-21 డిగ్రీ, పీజీ మొదటి ఏడాదిలో  అడ్మిషన్‌ పొం దేందుకు ఈ నెల 31 వరకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌  విడుదల చేసింది. డిగ్రీలో అడ్మిషన్‌ కో సం పదో తరగతితో పాటు ఇంటర్‌ పాసైన వారు, పీజీలో చేరేందుకు డిగ్రీ పాసైన వారు అర్హులు. దరఖా స్తు, రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. డిగ్రీలో బీఏ, బీ కాం, బీకాం (కంప్యూటర్స్‌), బీబీఏ, బీఎల్‌ఐఎ్‌ససీ కోర్సులతో పాటు పీజీ లో  ఎంఏ, ఎంకాం, సైకాలజీ, సోష ల్‌ వర్క్స్‌, జర్నలిజం, ఎంహెచ్‌ఆర్‌ఎం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అడ్మిషన్‌లు కేయూ పరిధిలోని 12 జిల్లాల్లో నిర్వహిస్తున్నా రు. కేయూ పరిధిలో మొత్తం 50 అధ్యయన కళాశాలలు ఉన్నాయి. మరిన్ని వివరాలకు వెబ్‌ ఠీఠీఠీ. టఛీజూఛ్ఛిజుఠ.ఛిౌ.జీుఽ లో సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌ టెక్నికల్‌ ఇబ్బందులకు 6281429470లో మొబైల్‌ నెంబర్‌లను సంప్రదించవచ్చు. 

Updated Date - 2020-10-25T07:36:03+05:30 IST