చైనాలో మళ్లీ అదే సీన్! ప్రళయాన్ని చూసి కూడా మారని తీరు!

ABN , First Publish Date - 2020-04-01T20:55:41+05:30 IST

కరోనా కారణంగా ప్రపంచం ప్రళయం అంచులకు చేరుకున్నా చైనా మాత్రం తన తీరు మార్చుకోవట్లేదు. కరోనా మహమ్మారి పురుడు పోసుకున్న వెట్ మార్కెట్లను మళ్లీ తెరిపించింది. అవి మళ్లీ కస్టమర్లతో కిటికిటలాడుతున్నాయి.

చైనాలో మళ్లీ అదే సీన్! ప్రళయాన్ని చూసి కూడా మారని తీరు!

బీజింగ్: కరోనా కారణంగా ప్రపంచం ప్రళయం అంచులకు చేరుకున్నా చైనా మాత్రం తన తీరు మార్చుకోవట్లేదు. కరోనా మహమ్మారి పురుడు పోసుకున్న వెట్ మార్కెట్లను మళ్లీ తెరిపించింది. అవి మళ్లీ కస్టమర్లతో కిటికిటలాడుతున్నాయి. వెట్ మార్కెట్లు అంటే.. వివిధ రకాల అరుదైన జంతువులను అమ్మే స్థలాలు. వీటిని తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చైనాలోని సంపన్న వర్తాలు భావిస్తుంటాయి. అయితే ఇలాంటి మార్కెట్ల నుంచే కరోనా భూతం ప్రపంచమంతా పాకిందని చైనాకు తెలిసి కూడా అది మళ్లీ పాత పంథాలోనే ముందుకెళుతోంది.


అయితే ప్రపంచం దృష్టి దానిమీదే ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన పహారా మధ్య మార్కెట్లను నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని కొన్ని అంతర్జాతీయ పత్రికలు ఇటీవల ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి కొచ్చే వారెవ్వరూ కెమెరాలు, ఫోన్లతో పరిసరా ప్రాంతాలను ఫోటోలూ గట్రా తీయకుండా గట్టి పహారా కాస్తోందని తెలుస్తోంది. చైనాలో కరోనా పీడ విరగడైపోయిందని, ఇక ఇది ఇతర దేశాల సమస్య అని అక్కడి వారు భావిస్తున్నట్టు చైనా విలేకరి ఒకరు వ్యాఖ్యానించినట్టు అంతర్జాతీయ మీడియా ప్రచురించింది.

Updated Date - 2020-04-01T20:55:41+05:30 IST