Abn logo
Sep 23 2021 @ 00:43AM

సర్వర్‌ సమస్యపై డీలర్ల నిరసన

తహసీల్దార్‌కు ఈ-పోస్‌ యంత్రాలను స్వాధీనం చేస్తున్న డీలర్లు

తలుపుల, సెప్టెంబరు 22 : సర్వర్‌ సమస్యల వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోజుకు పది మందికి కూడా రేషన్‌ ఇవ్వలేక పోతున్నామని ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ బుధవారం డీలర్లు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఈ పోస్‌ యంత్రాలను తహసీల్దార్‌ శ్రీనివాసగౌడ్‌కు స్వాదీనం చేసి, వినతి పత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా డీలర్లు మాట్లాడుతూ మూడు నెలలుగా ఈపోస్‌ మిషన్‌లకు సర్వర్‌ సమస్య తలెత్తుతోందన్నారు. అదే ఎండీయూ వాహనాలలో బియ్యం పంపిణీ చేస్తున్నప్పుడు ఎలాంటి సర్వర్‌ సమస్య తలెత్తలేదన్నారు. కేవలం పీఎంజీకేవై రైస్‌ పంపిణీ చేసే సమయంలో మాత్రమే సర్వర్‌ సమస్య ఉత్పన్నమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీని వలన రోజుకు 10 మందికి కూడా బియ్యం పంపిణీ చేయలేక పోతున్నామని పేర్కొన్నారు. జిల్లా డీలర్ల అసోసియేషన్‌ పిలుపు మేరకు ఈ పోస్‌ యంత్రాలను తహసీల్దార్‌కు స్వాధీనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల డీలర్లు పాల్గొన్నారు.