డీన్ జోన్స్ మృతి.. షాక్‌లో క్రికెటర్లు

ABN , First Publish Date - 2020-09-25T02:01:15+05:30 IST

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ ఆకస్మిక మృతిపై టీమిండియా క్రికెటర్, సహ కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర దిగ్భ్రాంతి

డీన్ జోన్స్ మృతి.. షాక్‌లో క్రికెటర్లు

ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ ఆకస్మిక మృతిపై టీమిండియా క్రికెటర్, సహ కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. డీన్ జోన్స్ మృతి విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు చెప్పాడు. ఉదయం బాగానే ఉన్నారని, రెండు రోజుల క్రితం అతడి కుమారుడితో వీడియో కాల్‌లో మాట్లాడానని పేర్కొన్నాడు. అప్పుడాయనకు ఎటువంటి సమస్య లేదని, అంతా మామూలుగానే ఉందని, దీనిని తాను నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. 


జోన్స్ మృతికి టీమిండియా సారథి కోహ్లీ ట్విట్టర్‌లో విచారం వ్యక్తం చేశాడు. జోన్స్ మృతి విషయం తెలిసి షాకైనట్టు చెప్పాడు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపాడు. ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిద్దామని అన్నాడు. జోన్స్ మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వార్నర్ ట్వీట్ చేశాడు. జోన్స్ కామెంటరీని  తాము ఎంజాయ్ చేసేవాళ్లమని, ఆయనతో కలిసి క్రికెట్ విశ్లేషణ ఇక ఉండదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.


ముంబైలో ఉంటూ ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ కామెంటరీ అందిస్తున్న జోన్స్ ఈ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.


Updated Date - 2020-09-25T02:01:15+05:30 IST