డియర్‌ పాలస్తీనా

ABN , First Publish Date - 2021-06-07T05:53:34+05:30 IST

ప్రియమైన పాలస్తీనా, అందమైన గాజా నగరమా, స్వేచ్ఛ కోసం దశాబ్దాల నీ పోరాటానికి చరిత్ర సాక్ష్యమై నిలిచింది....

డియర్‌ పాలస్తీనా

ప్రియమైన పాలస్తీనా,

అందమైన గాజా నగరమా,

స్వేచ్ఛ కోసం దశాబ్దాల నీ పోరాటానికి

చరిత్ర సాక్ష్యమై నిలిచింది

నిలువెత్తు విముక్తి ఉద్యమానివి నువ్వు

మేం ఎప్పుడు నీ వెంటే వున్నాం 


ఉరుముల మెరుపుల ఆకాశం కలవర పెడ్తుంది

నీ గగనతలంలో యుద్ధ విమానాలు

దూసుకు పోతున్నట్లు అనిపిస్తుంది

ఇంటి ఆవరణలో కురిసిన వడగండ్ల వాన

నీ వీధుల్లో కురిసే బుల్లెట్లను తలపిస్తుంది

పిల్లల గాయపడ్డ ముఖాలు,

బాంబు దాడిలో కొస ఊపిరి దేహాల ఆర్తనాదాలు,

మా కళ్ళలో బాధను నింపుతాయి

ప్రపంచ దేశాల వ్యూహాత్మక మౌనం గుచ్చుకుంటుంది 


ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ కెరటం

‘పాలస్తీనా విమోచనా సమితి’

ఎలా మరిచిపోతుంది చరిత్ర

ఉద్యమాలని, విప్లవాలని, పోరాట యోధుడిని,

గుండెలో దాచుకుంటుంది గాని!

సూర్య కిరణమల్లె ఆ రోజు ‘యాసర్‌ అరాఫత్‌’ రాకతో

నా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ పాఠశాల అయింది

ఆర్ట్స్‌ కాలేజీ గోడలన్నీ నినాదమై ప్రతిధ్వనించాయి 


నేను పుట్టక ముందే వివక్షకు గురైన నేల నీది 

apartheid for a longtime

శాంతి సంకేత కరచాలనానివి నువ్వు! అందుకే,

రామల్లా నగరి ‘యాసర్‌’ జ్ఞాపకాలను 


పదిలపర్చుకుంది ఆర్ట్‌ గేలరీలో

ప్రపంచం నిన్ను ప్రేమిస్తూనే వుంది పాలస్తీనా!

రహస్యంగా అయినా సరే!


మహెజబీన్‌

Updated Date - 2021-06-07T05:53:34+05:30 IST