Abn logo
Sep 24 2021 @ 17:00PM

కాస్త మోదీకి చెప్పండి: బైడెన్‌కు టికాయత్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: తమ గోడు పట్టించుకోవాలంటూ ఏకంగా అమెరికా అధ్యక్షుడికే విజ్ఞప్తి చేశారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్. ప్రస్తుతం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ను కలుసుకోనున్నారు. అయితే మోదీని కలిసిన సమయంలో భారత్‌లో కొనసాగుతున్న రైతు ఆందోళన గురించి మాట్లాడాల్సిందిగా బైడెన్‌ను టికాయత్ కోరారు.


శుక్రవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన ఆయన ‘‘డియర్ పోటస్ (ప్రెసిడెంట్ ఆఫ్ యూనైటెడ్ స్టేటస్ ఆఫ్ అమెరికా).. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇండియాలోని రైతులందరం ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన 11 నెలలుగా కొనసాగుతోంది. ఇప్పటికీ 700 మంది రైతులు ఆందోళన చేస్తూ ప్రాణాలు వదిలారు. ఈ నల్ల చట్టాలను తొలగించి మా ప్రాణాలను కాపాడాలి. ప్రధాని మోదీతో సమావేశమయ్యే సమయంలో దయచేసి మా ఈ సమస్యపై దృష్టి సారించండి’’ అని ట్వీట్ చేశారు. ట్వీట్‌లో ‘‘రైతుల గురించి బైడెన్ మాట్లాడాలి’’ అనే హ్యాష్‌ట్యాన్‌ను చేర్చారు.

ఇవి కూడా చదవండిImage Caption