గేదెకు దశదిన కర్మ... గ్రామస్తులందరికీ అన్నదానం!

ABN , First Publish Date - 2021-01-09T15:53:55+05:30 IST

యూపీలోని మీరట్‌కు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఒక గేదెకు దశదిన కర్మలు చేస్తున్న...

గేదెకు దశదిన కర్మ... గ్రామస్తులందరికీ అన్నదానం!

మీరట్: యూపీలోని మీరట్‌కు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఒక గేదెకు దశదిన కర్మలు చేస్తున్న చేస్తున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా గ్రామస్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని మృతి చెందిన గేదెకు నివాళులు అర్పించారు. ఈ ఉదంతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. మొహమ్మద్ షాకిస్త్ గ్రామానికి చెందిన సుభాష్ వ్యవసాయం చేస్తుంటాడు. గత 32 ఏళ్లుగా ఒక గేదెను కూడా సంరక్షిస్తున్నాడు. 


ఈ మధ్య కొంతకాలంగా ఆ గేదె పాలు ఇవ్వడం మానివేసింది. సుభాష్‌కు ఆ గేదెతో ప్రత్యేక అనుబంధం ఉంది. అది అనారోగ్యం బారిన పడినప్పుడు ఎంతో ఖర్చు చేసి వైద్యం చేయించాడు. అయినప్పటికీ ఆ గేదెను కాపాడుకోలేకపోయాడు. ఆ గేదె మృతి చెందడంతో సుభాష్ కుటుంబ సభ్యులంతా ఎంతో బాధపడ్డారు. ఆ గేదెకు శాస్త్రబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆది మృతి చెందిన పదవ రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు గ్రామస్తులందరికీ అన్న సంతర్పణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గేదె శ్రద్ధాంజలి సభకు గ్రామస్తులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ ఆ గేదె తమ ఇంటిలో సభ్యురాలిగా మెలిగిందని, దాని ఆత్మశాంతి కోసం సంప్రదాయబద్ధంగా కర్మకాండలు నిర్వహించామన్నారు. 


Updated Date - 2021-01-09T15:53:55+05:30 IST