విజయాల దశమి

ABN , First Publish Date - 2021-10-15T05:37:04+05:30 IST

దసరా విజయానికి సంకేతంగా జరుపుకొనే పండుగ. ఆశ్వీయుజమాసం ప్రారంభం నుంచి తొమ్మిది రోజుల తర్వాత వచ్చే శ్రవణా నక్షత్రంతో కూడిన ‘దశమి’ రోజున ఈ పర్వదినాన్ని జరుపుకోవటం ఆనవాయితీ. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం తథ్యమని ప్రతీతి. వాహన, యంత్ర, ఆయుధపూజలు చేసేరోజు. విజయదశమి రోజున జమ్మిచెట్టును పూజించటం ఐశ్వర్యదాయకం.

విజయాల దశమి
దసరా సందర్భంగా ఒంగోలులో కళారావాల ఉత్సవం

ఒంగోలు  అక్టోబరు 14 : 

దసరా విజయానికి సంకేతంగా జరుపుకొనే పండుగ. ఆశ్వీయుజమాసం ప్రారంభం నుంచి తొమ్మిది రోజుల తర్వాత వచ్చే శ్రవణా నక్షత్రంతో కూడిన ‘దశమి’ రోజున ఈ పర్వదినాన్ని జరుపుకోవటం ఆనవాయితీ. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం తథ్యమని ప్రతీతి. వాహన, యంత్ర, ఆయుధపూజలు చేసేరోజు. విజయదశమి రోజున జమ్మిచెట్టును పూజించటం ఐశ్వర్యదాయకం. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అంతటా స్వామివార్లకు పార్వేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది ‘తిరునాళ్ల’ను తలపించే విధంగా చిన్నాపెద్దా, కులమత భేదం లేకుండా అందరూ వచ్చి చూసి ఆనందించే ఉత్సవం. శుక్రవారం దసరా ఉత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు. కరోనా మహమ్మారిని తరిమి అందరినీ కాపాడాలని అమ్మవారిని వేడుకుంటున్నారు. . కాగా ఒంగోలులో ప్రత్యేకంగా నిర్వహించే కళారాల ఉత్సవం   గురువారం రాత్రి కోలాహలంగా సాగింది.

 







Updated Date - 2021-10-15T05:37:04+05:30 IST