Advertisement
Advertisement
Abn logo
Advertisement

మూడేళ్ళుగా ‘డిసెంబరు’ కలిసొచ్చింది...

హైదరాబాద్ : గత నెల రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు దిద్దుబాటులో ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రోన్, ద్రవ్యోల్భణ ఆందోళనలు, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో సూచీలు నష్టపోయినప్పటికీ... కొన్ని స్టాక్స్ లాభాల్లోనే కొనసాగాయి. ఇతరత్రా స్టాక్స్‌లో మాత్రం చాలావరకు నష్టాల్లో ఉన్నాయి. అయితే కిందాటేడాది కరోనా, అంతకుముందు ఏడాది మందగమనం వంటి వివిధ ప్రతికూల పరిస్థితుల్లోను కొన్ని స్టాక్స్ వరుసగా గత మూడేళ్లలో డిసెంబరు నెలలో సానుకూల రిటర్న్స్‌ను  ఇచ్చాయి. గతమూడు దఫాలు కూడా డిసెంబరు నెలలో లాభాలనందించిన  ఎనిమిది స్టాక్స్... పది శాతం మేర రిటర్న్స్ ఇచ్చాయి.


డబుల్ డిజిట్ గ్రోత్... 

గత మూడేళ్లలో డిసెంబరు నెలలో మంచి రిటర్న్స్ ఇచ్చిన ఈ స్టాక్స్ ... మార్కెట్ క్యాప్ రూ. 500 కోట్లకు పైమాటే. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. బ్లాక్ బాక్స్ లిమిటెడ్ వరుసగా మూడేళ్ల పాటు డిసెంబరులో డబుల్ డిజిట్ రిటర్న్స్‌నందించింది. 2018 డిసెంబరులో 11 శాతం, 2019 డిసెంబరు నెలలో 19 శాతం, 2020 డిసెంబరులో 24 శాతం రిటర్న్స్ ఇచ్చింది.


హిందూస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్ కూడా డబుల్ డిజిట్ రిటర్న్స్‌ను అందించింది. 2018 డిసెంబరు నెలలో 16 శాతం, 2019 డిసెంబరులో 14 శాతం, 2020 డిసెంబరులో 75 శాతం రిటర్న్స్ ఇచ్చింది.


జేఎస్‌డబ్ల్యు ఇస్పాట్ స్పెషల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ 2018 డిసెంబరులో 14 శాతం, 2019 డిసెంబరులో 45 శాతం, 2020 డిసెంబరు నెలలో 61 శాతం రిటర్న్స్ ఇచ్చింది.


జేటీఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ 2018 డిసెంబరు నెలలో 15 శాతం, 2019 డిసెంబరు 14 శాతం, 2020 డిసెంబర్ నెలలో 12 శాతం రిటర్న్స్ ఇచ్చింది.


కెల్టాన్ టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ 2018 డిసెంబరులో 32 శాతం, 2019 డిసెంబరు నెలలో 19 శాతం, 2020 డిసెంబరు  నెలలో 39 శాతం రిటర్న్స్ ఇచ్చింది.


రానే లిమిటెడ్ 2018 డిసెంబరులో 11 శాతం, 2019 డిసెంబరు నెలలో 34 శాతం, 2020 డిసెంబరులో 15 శాతం రిటర్న్స్ ఇచ్చింది. 

Advertisement
Advertisement