తెలంగాణలో టెన్త్ పరీక్షలపై నేడు నిర్ణయం

ABN , First Publish Date - 2020-06-05T16:27:50+05:30 IST

తెలంగాణలో పదోతరగతి పరీక్షలపై శుక్రవారం హైకోర్టు విచారణ చేయనుంది.

తెలంగాణలో టెన్త్ పరీక్షలపై నేడు నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణలో పదోతరగతి పరీక్షలపై శుక్రవారం హైకోర్టు విచారణ చేయనుంది. ఈనెల 8వ తేదీనుంచి మిగిలిన టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని కోర్టు ఆదేశాల మేరకే షెడ్యూల్ ఇచ్చామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాలు లేవని న్యాయస్థానానికి నివేదించారు. కోవిడ్-19 కారణంగా అర్ధాంతరంగా ఆగిన టెన్త్ పరీక్షల్లో మిగిలిన పరీక్షలను ఈనెల 8 నుంచి ప్రభుత్వం నిర్వహించనున్నట్లు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ గురువారం హైకోర్టుకు తెలిపారు.


తెలంగాణలో కరోనా కేసులు ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో టెన్త్ పరీక్షలపై ముందుకు వెళ్లడానికే నిర్ణయించారా? అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. టెన్త్ పరీక్షలకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారమే షెడ్యూల్‌ను ప్రకటించినట్లు తెలిపారు. దీనికి సంబందించిన నివేదికను కోర్టు పరిశీలనకు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక తమకు చేరలేదన్న న్యాయస్థానం ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో టెన్త్ పరీక్షలు నిలుపుదల చేయాలని కోరుతూ  ఎం. బాలకృష్ణ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2020-06-05T16:27:50+05:30 IST