చైనాలో తగ్గుతున్న పెళ్లి సందళ్లు

ABN , First Publish Date - 2021-11-25T08:47:59+05:30 IST

ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశమైన చైనాలో జననాల రేటు బాగా పడిపోతోంది. అక్కడ పెళ్లిళ్లు తక్కువగా అవుతుండమే దీనికి కారణం కావొచ్చు అనే అభిప్రాయాలు

చైనాలో తగ్గుతున్న పెళ్లి సందళ్లు

  • జనాభా వృద్ధి రేటు అందుకే పడిపోతోందా? 


బీజింగ్‌, నవంబరు 24: ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశమైన చైనాలో జననాల రేటు బాగా పడిపోతోంది. అక్కడ పెళ్లిళ్లు తక్కువగా అవుతుండమే దీనికి కారణం కావొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో వరుసగా ఏడో సంవత్సరం కూడా పెళ్లిళ్ల సంఖ్యలో క్షీణత నమోదైంది. చైనా వార్షిక గణాంకాల పుస్తకం-2021 ఆధారంగా ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు మధ్య 58.7 లక్షల పెళ్లిళ్లు మాత్రమే నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన పెళ్లిళ్ల సంఖ్యతో పోలిస్తే ఇది ఇంకొంత తక్కువే. గత ఏడాది చైనాలో జననాల రేటు 0.852 శాతంగా నమోదైంది. 1978 తర్వాత అక్కడ జననాల రేటు ఒక శాతం లోపునకు పడిపోవడం అదే తొలిసారి. చైనా జనాభాలో యువత సంఖ్య నానాటికి పడిపోతుండటం వల్లే పెళ్లిళ్ల సంఖ్య తగ్గుతోందని నిపుణులు అంటున్నారు.

Updated Date - 2021-11-25T08:47:59+05:30 IST